inlaws harassment
-
Vizag Beach: వివాహిత శ్వేత మృతి కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత అనుమానాస్పద మృతి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. భర్త మణికంఠ చెల్లెలి భర్తపైన లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. విశాఖలోని జ్ఞానాపురం స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతోపాటు శ్వేత సెల్‌ఫోన్ కీలకంగా మారింది. మృతురాలి మొబైల్‌ను పరిశీలిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా అత్తింటి వేధింపులతో విశాఖ బీచ్‌లో ఐదు నెలల గర్భిణి శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చదవండి: విశాఖ బీచ్‌లో గర్భిణీ మృతదేహం.. పెళ్లైన నెల నుంచే వేధింపులు.. సూసైడ్ నోట్ స్వాధీనం అసలేం జరిగిందంటే.. పెదగంట్యాడ మండలం నడుపూరులో గురువెల్లి మణికంఠ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. దొండపర్తికి చెందిన శ్వేత(24)తో గత ఏడాది మణికంఠకు వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల కిందట అతను హైదారాబాద్ వెళ్లాడు. శ్వేతను ఇక్కడే అతని తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. మంగళవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె సాయంత్రం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తామామలు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో ఆమె మామ శాంతారావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆర్.కె.బీచ్‌లో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 3వ పట్టణ పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని శ్వేత ఫొటోతో సరిపోల్చి.. న్యూపోర్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన భర్తతో ఉన్న కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చిట్టీ(మణికంఠ ముద్దు పేరు) నేను లేకపోయినా నువ్వు బిందాస్‌గా జీవిస్తావని నాకు తెలుసు. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. బిగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ థింగ్ అని రాసి ఉంది. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. -
విదేశాంగ వ్యవహారాలశాఖ ఉద్యోగినికీ అత్తింటిపోరు
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ మహిళలకే కాకుండా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న మహిళలకు కూడా అత్తింటివారి వేధింపులు తప్పట్లేదని కొన్ని సంఘటనలు రుజువు చేసిన విషయం తెలిసిందే. అలాంటిదే తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి మాత్రం విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళ తనకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే గుర్గావ్లోని సెక్టార్ 49లో ఉంటున్న ఓ గృహిణి విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె 2016, జూలై 21న రజ్నీష్ గులాటి అనే ఢిల్లీకి చెందిన డాక్టర్‌ను వివాహం చేసుకుంది. ఆయన ముదిత్ విశ్వకర్మ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె గర్భం దాల్చగా తన కడుపులో పెరుగుతుందని ఆడ బిడ్డ అని వెంటనే అబార్షన్ చేసుకోవాలని భర్త దాడి చేశాడు. తన అత్త, మామ, ఆడబిడ్డ అందరూ కలిసి తనను ఇంట్లో నుంచి ఈడ్చి పడేశారని తీవ్ర వేధింపులకు గురిచేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
చక్రి భార్యకు అత్తింటి వేధింపులు?
గుండెపోటుతో మరణించిన సంగీత దర్శకుడు చక్రి తల్లి, అక్కాచెల్లెళ్లు తనను వేధిస్తున్నట్లు ఆయన భార్య శ్రావణి ఆరోపించారు. చక్రిని చంపే ప్రయత్నం నువ్వే చేశావంటూ ఆమెను అత్తమామలు వేధించడం మొదలుపెట్టారని ఆమె అన్నారు. మానసికంగా తనను వేధిస్తున్నారని ఆమె తెలిపారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. చక్రి, శ్రావణిలది ప్రేమవివాహం. పదేళ్ల క్రితం వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇటీవలి వరకు అయినవాళ్లంతా వాళ్లకు దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా దగ్గరకు వస్తున్నారు. గతంలో శ్రావణి మీద దాడులు జరిగాయి. సుమారు నెల రోజుల క్రితం ఆమె అత్త, మరిది విడిగా వెళ్లిపోయారు. చక్రి మరణించిన తర్వాత వాళ్లంతా కలిసి చక్రి ఇంట్లోనే ఉంటున్నారు. కానీ.. శ్రావణి కనీసం నీళ్లు తాగిందో లేదో కూడా చూడట్లేదని చెబుతున్నారు. చక్రికి ఎలాంటి ఆస్తులున్నాయో కూడా ఆమెకు తెలియదని అంటున్నారు. కాగా, అత్తింటి వేధింపులపై స్పందించేందుకు సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి నిరాకరించారు. తన భర్త మరణించి ఇప్పటికి కేవలం మూడు రోజులే అయ్యిందని, అందువల్ల ముందు ఈ 11 రోజులు ఆయన కర్మకాండలన్నీ పూర్తి కానివ్వాలని ఆమె మీడియాను వేడుకున్నారు. ఇప్పుడు తానేమీ మాట్లాడే పరిస్థితిలో లేనని, కనీసం నిలబడే స్థితిలో కూడా లేనని చెప్పారు. తనకు మాటిమాటికీ స్పృహ తప్పుతోందని, నిన్న కూడా తాను ఫిట్స్‌తో పడిపోయానని అన్నారు. వేధింపులు ఉన్నట్లు ఏమైనా చెబుతారా అని అడగగా.. ఆ విషయం దేవుడికే తెలియాలంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఓసారి తనను వాళ్లు తల గోడకేసి కొట్టారని, కానీ ఆ విషయం ఆయన చూడలేదని శ్రావణి చెప్పారు. చక్రి ఆరోగ్యం గురించి ఫోన్లు చేసినా ఎవ్వరూ ఫోను ఆన్సర్ చేయలేదని తెలిపారు. తాను కనీసం చెప్పులు కూడా లేకుండా చక్రిని తీసుకుని అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లానన్నారు. వాళ్లు ఎప్పుడొచ్చారో తెలియదని, మధ్యాహ్నం ఫిలిం చాంబర్లో మృతదేహం ఉన్నప్పుడు.. వాళ్ల సామాన్లన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తన కప్ బోర్డులన్నీ తాళాలు వేసేశారని, చక్రి డెబిట్ కార్డులు, చెక్కు పుస్తకాలు, ఉంగరాలు, గొలుసులు అన్నీ తీసుకెళ్లిపోయారని అన్నారు. భర్తను చంపుకొనేదాన్ని కాదని, వాళ్లే ముందు ఇంట్లోంచి వెళ్లిపోయారని శ్రావణి తెలిపారు. కనీసం తనకు కట్టుబట్టలు కూడా లేవని, కప్ బోర్డుల తాళాలన్నీ తీసుకెళ్లిపోయారని చెప్పారు. తనను బయటివాళ్లు తప్ప, ఇంట్లో వాళ్లు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఫిట్స్ వచ్చినా కూడా తన మొహం చూడలేదన్నారు. తనకు డబ్బు అక్కర్లేదని, డబ్బు ఆశించేదాన్ని కాదని తెలిపారు. తామిద్దరికీ ఎప్పుడూ గొడవలు లేవని, పొద్దున్న తన మొహం చూడకుండా లేవరని, కళ్లు మూసుకుని శ్రావణీ.. ఎక్కడున్నావని పిలిచేవారని వాపోయారు.