కడుపునొప్పి భరించలేక ఓ యువతి గోళ్లరంగు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఏలూరులో చోటుచేసుకుంది.
యువతి ఆత్మహత్యాయత్నం
Sep 30 2013 1:34 AM | Updated on Nov 6 2018 7:53 PM
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : కడుపునొప్పి భరించలేక ఓ యువతి గోళ్లరంగు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఏలూరులో చోటుచేసుకుంది. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సత్రంపాడు ఎంఆర్‌సీ కాలనీకి చెందిన వానపల్లి మౌనిక డిగ్రీ చదువుతోంది. ఆమెకు ఆదివారం ఉదయం విపరీతంగా కడుపునొప్పి రావడంతో ఇంట్లోని గోళ్లరంగును మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కడుపు నొప్పి భరించలేక..
ఏలూరు క్రైం, న్యూస్‌లైన్ : కడుపునొప్పి భరించలేక ఓ వృద్ధురాలు కలుపు నివారణ మందును మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెదవేగి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం తాళ్లగోకవరం గ్రామానికి చెందిన కర్రి గౌరమ్మ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆదివారం ఉదయం విపరీతమైన నొప్పి రావడంతో ఇంట్లో ఉన్న కలుపు నివారణ మందును తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.
Advertisement
Advertisement