అనంతపల్లి: దోపిడి దొంగల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. దుండగులు యదేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఏటీఎంలపై కన్నేసిన దోపిడీ దొంగలు నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లిలో గురువారం దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం చేశారు. అక్కడి స్థానికులు గమనించి అప్రమత్తం కావడంతో దుండగులు కారంచల్లి పరారైనట్టు సమాచారం.