తండ్రి కాదు మృగం | Father Molestation on Daughter in Hyderabad | Sakshi
Sakshi News home page

తండ్రి కాదు మృగం

Published Thu, Jun 18 2020 6:44 AM | Last Updated on Thu, Jun 18 2020 6:44 AM

Father Molestation on Daughter in Hyderabad - Sakshi

దుండిగల్‌: రక్తం పంచుకుని పుట్టిన బిడ్డపై ఓ కర్కశ తండ్రి పాశవికానికి పాల్పడ్డాడు. మానవత్వానికే మచ్చ తెచ్చిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశం, బాధితురాలి కథనం ప్రకారం.. సూరారం కాలనీ శివాలయనగర్‌కు చెందిన ఓ వ్యక్తి (35) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె (14)లు ఉన్నారు. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి కుమార్తెపై ఆఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుటుంబ సభ్యు లందరినీ హతమారుస్తానంటూ బెదిరించి లొంగ దీసుకున్నాడు. ఇటీవల లైంగిక వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితురాలు బుధవారం దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిపై దాడి చేసే క్రమంలో కుటుంబ సభ్యులే వత్తాసు పలకడం గమనార్హం. అయితే ప్రస్తుతం బాలిక 5 నెలల గర్భవతి. పోలీసులు నిందితుడిపై 376(2)(ఎఫ్‌) (ఎన్‌), 506, ఫోక్సో 5 (ఎల్‌),(6) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement