బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు | Road Accident Near Hayathnagar Highway, 2 people Injured | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు

Published Fri, Oct 16 2020 9:22 AM | Last Updated on Fri, Oct 16 2020 9:58 AM

Road Accident Near Hayathnagar Highway, 2 people Injured - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో గురువారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వైపు వస్తున్న కారు రహదారిపై ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా ప్రమాదానికి కారణం అయిన కారులోని వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దాదాపు రాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. చదవండి: కలెక్టర్ కారును ఢీ కొట్టిన లారీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement