
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. కాగా, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్ చేశారు.
ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment