cydabad
-
చిన్నారి అత్యాచారం కేసు: తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
హైదరాబాద్: తెలంగాణలో కలకలం రేపిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దీని కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. కాగా, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ ఉద్యోగులను అలర్ట్ చేశారు. ఇప్పటికే బస్టాండ్, బస్సుల్లో నిందితుడి ఆనవాళ్లు ఉన్న పోస్టర్లను అతికించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే నిందితుడిపై పోలీసు శాఖ రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసు: పోలీసుల కీలక నిర్ణయం -
చెట్టుపై పిడుగు..వ్యాపించిన మంటలు
సైదాబాద్: సైదాబాద్‌లో శుక్రవారం రాత్రి ఓ చెట్టుపై పిడుగుపడింది. దీంతో వెంటనే చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా పక్కనే ఉన్న ఇంటికి కూడా అగ్నికీలలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పుతున్నారు. -
ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు
సైదాబాద్: ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వాహనాలను పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి అన్నారు. సైదాబాద్ మండల పరిధిలోని సుబ్రహ్మణ్యనగర్‌లో శనివారం సైదాబాద్ ఇన్స్పెక్టర్ సత్తయ్యతో కలిసి ఆయన వాహనాలను తనిఖీ చేశారు. సుబ్రహ్మణ్య నగర్లో ఎక్కడ పడితే అక్కడ ఆటోలను నిలుపుతున్నారని స్థానికులు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు పార్కింగ్‌పై అవగాహన కల్పించారు. సుబ్రహ్మణ్యనగర్ పార్కు వద్ద వాహనాలను నిలుపుకోవాలని కానీ కాలనీలో ఇళ్ల ముందు ఆటోలను పార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లు ఎక్కువ కిరాయి తీసుకున్నా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన ఫోన్నెంబర్లను అక్కడి గోడలపై రాశారు. ప్రతి వాహనదారుడు రోడ్డు, రవాణ చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని సూచించారు. పోలీసు సేవలకు సంబంధించి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. దాని ద్వారా ఫిర్యాదుతో పాటు అత్యవసర సమయాల్లో కూడా వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు సత్యనారాయణరాజు, ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.