బాలికపై యువకుడి అకృత్యం | Man Molested Minor Girl Kulsumpura Area Case Filed Against Him | Sakshi
Sakshi News home page

బాలికపై యువకుడి లైంగిక దాడి

Published Fri, Aug 21 2020 9:34 AM | Last Updated on Fri, Aug 21 2020 11:15 AM

Man Molested Minor Girl Kulsumpura Area Case Filed Against Him - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్‌ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(20 ఏళ్ల వ్య‌త్యాసం.. ప్రియుడితో క‌లిసి భ‌ర్తను)

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్‌ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్‌ స్టేషన్‌లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(‘మహా నగరంలో మాయగాళ్లు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement