kulsumpura
-
హైదరాబాద్: మంత్రాలు చేసి నా బిడ్డను చంపేశారు!
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ బస్తీలో ఆత్మహత్య చేసుకున్న టీనేజర్ వ్యవహారంలో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమెను క్షుద్ర పూజలు చేసి బలవన్మరణానికి పాల్పడేలా చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ ఇంటి ముందు ఎవరో క్షుద్ర పూజలు చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించలేదని నవ్య తల్లి చెబుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది నవ్య. అయితే తమ ఇంటి ముందు వారం నుంచి ఎవరో పూజలు చేస్తున్నారని, మంత్రాలు చేసి తన కూతురిని చంపేశారని నవ్య తల్లి వాపోతోంది. ‘‘గత వారం రోజులుగా ఇంటి ముందు క్షుద్రపూజలు చేస్తున్నారు. నిమ్మకాయలు, దీపాలు, బొమ్మలు, పసుపు-కుంకుమతో పూజలు చేస్తున్నారు. వాటిని ఫొటోలు తీశాం. వాటిని తొలగించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం. కానీ, వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసులు చర్యలు తీసుకుని.. నిందితులను పట్టుకుని ఉంటే ఇవాళ నా కూతురు ప్రాణాలతో ఉండేదేమో అంటూ సాక్షితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది నవ్య తల్లి. బుధవారం ఉదయం కూడా నవ్య బాగానే ఉందని, తనను.. తన భర్తను పనులకు నవ్వుతూ సాగనంపిందని, ఇవాళ(గురువారం) కాలేజీకి వెళ్తానని కూడా నవ్య చెప్పిందని ఆమె జరిగిందంతా వివరించారు. మరోవైపు నవ్య కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆత్మహత్య కేసును.. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం.. 12 ఏళ్ల బాబు మృతదేహన్ని పిక్కుతిన్న వీధికుక్కలు
-
హైదరాబాద్‌లో దారుణం.. బాబు మృతదేహాం కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాబు మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారంతో రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతి చెందిన బాలుడిని సోఫియన్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. బాబును ఎవరో హత్య చేసి అక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: మిస్టరీగా వందన మృతి.. సందీప్ ఇంట్లో ఏం జరిగింది..? -
ఇంట్లో చొరబడి ఎవర్నీ వదల్లేదు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కుల్సుంపురలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్కింగ్ విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ వర్గానికి చెందిన రౌడీ మూక మరో వర్గంపై రాళ్లు, తల్వార్లతో దాడి చేసింది. కుల్సుంపురలోని ముస్తైద్‌పురా బస్తీలో నివాసముండే ఫరూక్ హుస్సేన్ తన ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడు. అటుగా వచ్చిన ఫిరోజ్ అలియాస్ అల్లూ వచ్చి రోడ్డుపై బైక్ ఎందుకు పెట్టావంటూ గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తన సోదరులు దర్వేష్ అలియాస్ బబ్బు, జాఫర్, మరికొంత మందితో కలిసి ఫరూక్ హుస్సేన్ ఇంటిని చుట్టుముట్టారు. బైక్‌ని ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడి కిటికీలు, టీవీ, మొబైల్ ఫోన్లు పగులగొట్టారు. అడ్డొచ్చిన ఫరూక్ కుమారుడిపై తల్వార్‌తో దాడి చేశారు. చంపేస్తామని తుపాకీతో బెదిరించారు. ఇంట్లోని మహిళలపై సైతం పిడిగుద్దుల వర్షం కురిపించారు. అయితే, దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ఫిర్యాదును స్వీకరించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. గాయాలపాలైన ఫరూక్ హుస్సేన్ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. (చదవండి: నగరపాలక సంస్థలో బయటపడ్డ అవినీతి) -
బాలికపై యువకుడి అకృత్యం
సాక్షి, హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా నిద్ర మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(20 ఏళ్ల వ్యత్యాసం.. ప్రియుడితో కలిసి భర్తను) ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్ స్టేషన్లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.(‘మహా నగరంలో మాయగాళ్లు’) -
కులుసుంపురాలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కులుసుంపురాలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశంలో పేరుకున్న చెత్త కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్నా గుడిసెలకు వ్యాపిస్తుండటంతో స్ధానికలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారు.