బాలికపై యువకుడి లైంగిక దాడి | Hyderabad: Man Molested Minor Girl Kulsumpura Area Case Filed Against Him | Sakshi
Sakshi News home page

బాలికపై యువకుడి లైంగిక దాడి

Published Fri, Aug 21 2020 10:28 AM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

సాక్షి, హైదరాబాద్‌: కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వివరాలు.. స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ రాజకీయ నాయకుడి కుమారుడైన రోహన్‌ అనే యువకుడు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఓ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి, బలవంతంగా మాత్రలు మింగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని నిలదీయడంతో వారిపై కక్షగట్టాడు. తన అకృత్యం గురించి బయటపెడితే బాధితురాలిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో రోహన్‌ కారణంగా తమకు ప్రాణహాని ఉందంటూ బాధిత బాలిక కుటుబీకులు కుల్సుంపుర పోలీస్‌ స్టేషన్‌లో ఆగష్టు 12న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement