కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్‌ అవ్వదు!! | US Cars Mandated To Identify Drunk Drives And Stop Them | Sakshi
Sakshi News home page

US Cars Mandated To Identify Drunk Drives : కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ

Published Thu, Nov 18 2021 10:53 AM | Last Updated on Thu, Nov 18 2021 11:57 AM

US Cars Mandated To Identify Drunk Drives And Stop Them - Sakshi

వాషింగ్టన్‌: ఇప్పటి వరకు బ్రీత్-స్నిఫింగ్ సెన్సార్‌లతో తాగి డ్రైవ్‌ చేసేవాళ్లను పట్టుకోవడం కోసం నిరతరం పోలీసులు అప్రమత్తతో పనిచేస్తుండేవారు. ఇక  అలాంటి పరిస్థి అవసరం లేకుండా ఎవరైన డ్రింక్‌ చేసి కారు నడిపితే ఆ కారు ఆటోమెటిక్‌గా స్టార్ట్‌ అవ్వకుండా ఆగిపోయేలా అమెరికా కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేసేలా రూపొందించనుంది. ఈ సరికొత్త సాంకేతికతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు అని అమెరికా అంటోంది. రానున్న సంవత్సరాలలో ఆల్కహాల్‌ సేవించిన డ్రైవర్లను గుర్తించేలా ఈ కొత్త టెక్నాలజీ కార్లను రూపొందించే యూఎస్‌ ఫెడరల్‌ చట్టం విదేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని, పైగా ఏటా వేలాది ప్రాణాలను కాపాడగలమంటూ న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు.

(చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్‌ వెయిటింగ్‌ రూమ్‌!)

ఇటీవలే జో బిడెన్‌ ఈ చట్టంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం కారణంగా క్రిమినల్‌ కేసులలో యజమానులకు విరుద్ధంగా ప్రభావంతమైన సాక్షులను అందించగలదా అన్నది కాస్త సందేహాలకు తావిచ్చేలా  ఉంది. అంతేకాదు ఈ చట్టం పూర్తిస్థాయిలో పనిచేయలంటే కనీసం మూడు సంవత్సారాలు పడుతుంది. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో ఆల్కహాల్-సంబంధిత క్రాష్‌లకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులకు మాత్రం ఇది ఆనందాన్నిచ్చే విషయం. ఈ మేరకు డ్రంక్ డ్రైవింగ్ వ్యతిరేక అడ్వకేసీ గ్రూప్ ఎంఏడీడీ జాతీయ అధ్యక్షుడు అలెక్స్ ఒట్టే మాట్లాడుతూ..." ఈ చట్టం ఒకరకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ముగింపుకి నాంది పలుకుతుంది." అంటూ సంతోషం వ్యక్తం చేశారు.  

ఈ అ‍త్యధునిక టెక్నాలజీతో కూడిన​ కారులో డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్టీ (డీఏడీఎస్‌ఎస్‌)లో భాగంగా డ్రైవర్ శ్వాసను సంగ్రహించి పరీక్షించేలా ఒక విధమైన సెన్సార్‌లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంతేకాదు డ్రైవర్ కారు బటన్‌ను ఆన్‌ చేసిన వెంటనే అది వ్యక్తివేళ్ల నుంచి పరారుణ-కాంతిని నేరుగా చర్మం పై ప్రసరించి అక్కడ  ఉపరితలం క్రింద ఉన్న రక్తంలోని ఆల్కహాల్ స్థాయిలను కొలుస్తుంది. ఈ క్రమంలో ఆటోమోటివ్ కోయాలిషన్ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రెసిడెంట్ రాబర్ట్ స్ట్రాస్‌బెర్గర్ మాట్లాడుతూ..."చాలా యూఎస్‌ రాష్ట్రాల్లో .08 శాతంకి మించి బ్లడ్‌లో ఆల్కహాల్ ఉంటే  కారును స్టార్ట్ చేయకుండా లేదా ముందుకు కదలకుండా నిరోధించగల యాంటీ-చీట్ ఫంక్షన్‌లను కారులోని సిస్టమ్‌లో ఏర్పాటు చేశాం. పైగా దీనికి కారు తయారీదారుల మద్ధతు కూడా ఉంది" అని అన్నారు.

(చదవండి:  అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement