Federal Court of America
-
ట్రంప్‌పై నేరాభియోగాలు
మియామి: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఒకదాని తర్వాత మరొకటి కేసుల ఉచ్చు బిగుస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదయ్యాయి. ఒక మాజీ అధ్యక్షుడిపై ఫెడరల్ జ్యూరీ నేరుగా అభియోగాలు నమోదు చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ కేసులో 13 తేదీ మంగళవారం మియామి కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా అందాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఒక మాజీ అధ్యక్షుడికి దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. అమెరికా చరిత్రలో ఇదో చీకటి రోజుగా అభివర్ణించారు. దేశం ఎంతగా దిగజారిపోతున్నా, అందరం కలిసి అమెరికా గ్రేట్ ఎగైన్ అని నిరూపిద్దామని తన అభిమానులకి పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి జరుగుతున్న పోరులో ముందంజలో ఉన్న ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడం రాజకీయంగా ఆయనకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పాలి. నిన్నటికి నిన్న పోర్న్ స్టార్‌కి ముడుపులు చెల్లించిన కేసులో నేరాభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్ ఈ సారి ఏకంగా ఫెడరల్ జ్యూరీ అభియోగాలనే నేరుగా ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా 2021లో గద్దె దిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన రహస్య పత్రాలను ఆర్కీవ్స్‌కు అప్పగించకుండా ఫ్లోరిడాలో తన ఎస్టేట్‌కు తరలించారని ట్రంప్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే రుజువైతే వందేళ్లు జైలు రహస్య పత్రాల కేసులో గూఢచర్య చట్టం కింద డొనాల్డ్ ట్రంప్‌పై ఏడు అంశాల్లో అభియో గాలు నమోదయ్యాయి. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగా తన దగ్గర ఉంచుకోవడం, న్యాయ ప్రక్రియను అడ్డుకో వడానికి కుట్ర, నిజాయితీ లేకుండా డాక్యుమెంట్లను దాచిపెట్టడం, తన గుట్టు బయటపడకుండా పథక రచన, తప్పుడు ప్రకటనలు జారీ చేయడం వంటి అంశాల్లో అభియోగాలు నమోదయ్యాయి. ఇవి రుజువైతే ట్రంప్‌కి గరిష్టంగా వందేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ అభియోగాలు ఎలాంటి అడ్డంకి కాకపోయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వానికి ఎంత మద్దతు లభిస్తుందా అన్న అనుమానాలైతే ఉన్నాయి. -
కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!
వాషింగ్టన్: ఇప్పటి వరకు బ్రీత్-స్నిఫింగ్ సెన్సార్లతో తాగి డ్రైవ్ చేసేవాళ్లను పట్టుకోవడం కోసం నిరతరం పోలీసులు అప్రమత్తతో పనిచేస్తుండేవారు. ఇక అలాంటి పరిస్థి అవసరం లేకుండా ఎవరైన డ్రింక్ చేసి కారు నడిపితే ఆ కారు ఆటోమెటిక్‌గా స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయేలా అమెరికా కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ ఏర్పాటు చేసేలా రూపొందించనుంది. ఈ సరికొత్త సాంకేతికతో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చు అని అమెరికా అంటోంది. రానున్న సంవత్సరాలలో ఆల్కహాల్ సేవించిన డ్రైవర్లను గుర్తించేలా ఈ కొత్త టెక్నాలజీ కార్లను రూపొందించే యూఎస్ ఫెడరల్ చట్టం విదేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని, పైగా ఏటా వేలాది ప్రాణాలను కాపాడగలమంటూ న్యాయవాదులు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) ఇటీవలే జో బిడెన్ ఈ చట్టంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చట్టం కారణంగా క్రిమినల్ కేసులలో యజమానులకు విరుద్ధంగా ప్రభావంతమైన సాక్షులను అందించగలదా అన్నది కాస్త సందేహాలకు తావిచ్చేలా ఉంది. అంతేకాదు ఈ చట్టం పూర్తిస్థాయిలో పనిచేయలంటే కనీసం మూడు సంవత్సారాలు పడుతుంది. అయితే యునైటెడ్ స్టేట్స్లో ఆల్కహాల్-సంబంధిత క్రాష్‌లకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తులకు మాత్రం ఇది ఆనందాన్నిచ్చే విషయం. ఈ మేరకు డ్రంక్ డ్రైవింగ్ వ్యతిరేక అడ్వకేసీ గ్రూప్ ఎంఏడీడీ జాతీయ అధ్యక్షుడు అలెక్స్ ఒట్టే మాట్లాడుతూ..." ఈ చట్టం ఒకరకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ముగింపుకి నాంది పలుకుతుంది." అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అత్యధునిక టెక్నాలజీతో కూడిన కారులో డ్రైవర్ ఆల్కహాల్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ సేఫ్టీ (డీఏడీఎస్ఎస్)లో భాగంగా డ్రైవర్ శ్వాసను సంగ్రహించి పరీక్షించేలా ఒక విధమైన సెన్సార్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంతేకాదు డ్రైవర్ కారు బటన్‌ను ఆన్ చేసిన వెంటనే అది వ్యక్తివేళ్ల నుంచి పరారుణ-కాంతిని నేరుగా చర్మం పై ప్రసరించి అక్కడ ఉపరితలం క్రింద ఉన్న రక్తంలోని ఆల్కహాల్ స్థాయిలను కొలుస్తుంది. ఈ క్రమంలో ఆటోమోటివ్ కోయాలిషన్ ఫర్ ట్రాఫిక్ సేఫ్టీ ప్రెసిడెంట్ రాబర్ట్ స్ట్రాస్బెర్గర్ మాట్లాడుతూ..."చాలా యూఎస్ రాష్ట్రాల్లో .08 శాతంకి మించి బ్లడ్‌లో ఆల్కహాల్ ఉంటే కారును స్టార్ట్ చేయకుండా లేదా ముందుకు కదలకుండా నిరోధించగల యాంటీ-చీట్ ఫంక్షన్లను కారులోని సిస్టమ్‌లో ఏర్పాటు చేశాం. పైగా దీనికి కారు తయారీదారుల మద్ధతు కూడా ఉంది" అని అన్నారు. (చదవండి: అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ) -
అమెరికాలో తొలి పాక్–అమెరికన్ జడ్జి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక పాక్–అమెరికన్ వ్యక్తి ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఓటింగ్‌కు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమెరికా మొట్టమొదటి ముస్లిం–అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జాహిద్ ఖురేషీ (46) నియమితులయ్యారు. న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన విధులు నిర్వహించనున్నారు. కాగా, ఖురేషీ ఎంపికకు సంబంధించి సెనెట్ 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లతో ఏకీభవించడం గమనార్హం. దీనిపై సెనెటర్ రాబర్ట్ మెనెండెజ్ స్పందిస్తూ.. జడ్జి ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు. ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరో సారి రుజువైందన్నారు. న్యూజెర్సీ కోర్టులో ఇప్పుడు వైవిధ్యం సాధ్యమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు. ఇక ఖురేషీ ఎంపికపై ఇస్లాం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పాక్‌లో సంబురాలు చేసుకుంటున్నారు. 46 ఏళ్ల ఖురేషీ 2004, 2006లో ఇరాక్‌లో పర్యటించాడు. అంతేకాదు ఆయన తండ్రి కూడా గతంలో ప్రాసెక్యూటర్గా పని చేశాడు. చదవండి: ట్రంప్ రీఎంట్రీ.. ఎలా సాధ్యమంటే.. -
మోసపూరితంగా ‘హెచ్1బీ’.. వెలుగులోకి భారీ స్కాం..!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో పని చేయాలను కొనే భారతీయ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలను అక్రమ మార్గాల్లో మంజూరు చేయిస్తూ క్లౌడ్‌జెన్ ఎల్ఎల్సీ అనే టెక్నాలజీ కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ‘బెంచ్ అండ్ స్విచ్’ పద్ధతిలో ఈ సంస్థ సాగించిన కుంభకోణం అమెరికా టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరంలో వెలుగుచూసింది. ప్రస్తు తం అక్కడి ఫెడరల్ కోర్టులో ‘క్లౌడ్‌జెన్’పై వీసాల దుర్వినియోగం అభియోగాల కేసు నడుస్తోంది. మే 28న జరిగిన వాదనల్లో ‘క్లౌడ్‌జెన్’ వైస్ ప్రెసిడెంట్ జొమాన్ చొక్కలక్కల్ తాము మోసపూరితంగా పలువురికి హెచ్1–బీ వీసాలు ఇప్పించినట్లు న్యాయస్థానంలో అంగీకరించారు. ఈ కేసులో సెప్టెంబర్ 16న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ సంస్థకు సుమారు 10 లక్షల డాలర్ల జరిమానా, ఐదేళ్లపాటు అవకాశం ఉంది. ఈ వ్యవహారం అక్కడి ఎన్ఆర్ఐలలో పెద్ద దుమారమే రేపుతోంది. రొమేనియా, కెనడా కేంద్రంగా నడుస్తున్న క్లౌడ్‌జెన్ టెక్నాలజీ కంపెనీకి చెందిన ఒక శాఖ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోనూ ఉంది. ప్రస్తుతానికి ఈ సంస్థ మూతబడింది. కుంభకోణం జరిగింది ఇలా.. అమెరికా కేంద్రంగా నడిచే పలు కంపెనీల్లో ఉద్యోగాలు పొందే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1–బీ వీసాలు మంజూరు చేస్తారు. నిబంధనల ప్రకారం ముందుగా అక్కడ ఉన్న కంపెనీలతో ‘క్లౌడ్‌జెన్’ ఒప్పందం చేసుకొని నిపుణులను సరఫరా చేయాలి. ఏదైనా కంపెనీ ఫలానా వృత్తి నిపుణుడు కావాలని కోరినప్పుడు మాత్రమే అందుకు అర్హుడిని గుర్తించాలి. ఆపై వీసా ప్రాసెసింగ్ పూర్తి చేసి వారిని అమెరికా తీసుకువెళ్లాలి. ఇందుకు కొంత సమయం పడుతుంది. కానీ ‘క్లౌడ్‌జెన్’ మాత్రం నకిలీ కాంట్రాక్టులను లేబర్ డిపార్ట్మెంట్, హోంల్యాండ్ సెక్యూరిటీకి సమర్పించి అనుమతులు పొందేది. ఈ అనుమతులతో హెచ్1బీ వీసాలు దరఖాస్తు చేసేది. ఇలా వీసాలు లభించగానే భారతీయ నిపుణులను అమెరికా పంపేది. కానీ నిజంగా చేసేందుకు ఉద్యోగాలు లేకపోవడంతో వారికి అవసరమైన ఉద్యోగాలను వెతికిపెట్టే పని కూడా ‘క్లౌడ్‌జెన్’ చేసేది. విదేశీ వృత్తి నిపుణులు అందుబాటులో ఉండటంతో (బెంచ్) ఆ తర్వాత కాలంలో అమెరికా కంపెనీలకు అవసరమైన నిపుణులను వెంటనే అందించేది. ఇలా అక్కడి మార్కెట్లో అయాచిత లబ్ధి పొందేది. అప్పుడు ఆయా సంస్థలు భారతీయ వృత్తి నిపుణుల తరఫున ఇమ్మిగ్రేషన్ పత్రాలను (స్విచ్) సమర్పించేవి. ఉద్యోగాలు పొందిన భారతీయ వృత్తి నిపుణుల నుంచి ‘క్లౌడ్‌జెన్’ కమిషన్ తీసుకొనేది. ఇలా 2013 మార్చి నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 5 లక్షల డాలర్లను క్లౌడ్‌జెన్ సంపాదించింది. ఈ కంపెనీకి శశి పల్లెంపాటి ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా జొమాన్ చొక్కలక్కల్, సుదీప్ చందక్ వ్యవహరిస్తున్నారని సంస్థ వెబ్సైట్ పేర్కొంది. -
ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్..!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ట్రంప్ వద్ద పర్సనల్ లాయర్‌గా పనిచేసిన మైఖేల్ కోహెన్‌ను మన్‌హట్టన్‌లోని ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 ఎన్నికల సమయంలో కోహెన్ ఇద్దరు మహిళలకు డబ్బు ఆశ జూపి వారిని ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా పనిచేయకుండా చేశారని తెలిపింది. తనతో వ్యక్తిగత సంబంధాలున్న ఇద్దరు మహిళల వ్యతిరేక ప్రచారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి కోహెన్ పనిచేశాడని కోర్టు వెల్లడించింది. 8 చార్జిషీట్లలో దోషిగా తేలిన కోహెన్‌పై పన్ను ఎగవేత అభియోగాలు కూడా రుజువయ్యాయి. అయితే, కోర్టు విచారణలో ట్రంప్‌కు సంబంధించి కోహెన్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, కోహెన్ తరపు లాయర్ లానీ దావిస్ మాత్రం కోహెన్ ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేశాడని చెప్తున్నారు. కోహెన్ దోషిగా తేలినందున ఈ వ్యవహారంలో ట్రంప్‌కు కూడా చిక్కులు తప్పవని హెచ్చరించారు. కోహెన్ ఒకరికి లక్షా ముప్పై వేలు, మరొకరికి లక్షా యాభై వేల డాలర్లు చెల్లించినట్లు తేలిందని దావిస్ తెలిపారు. మరోవైపు ఇద్దరు మహిళలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. ట్రంప్, ఆయన కుంటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ట్రంప్ తరపు న్యాయవాది రూడీ గిలియానీ అన్నారు. ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని బజారున పెట్టి ఆయన కుటుంబంలో చిచ్చుపెట్టడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. కోహెన్ ట్రంప్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో కోహెన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని గ్రహించి అతన్ని ట్రంప్ ఎప్పుడో దూరం పెట్టాడని అన్నారు. -
‘ది పోస్ట్’ను సుప్రీం కోర్టు జడ్జీలు చూడాలి!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ ప్రభుత్వ రహస్యాలను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని ప్రజల దష్టికి తీసుకరావడం జర్నలిస్టుల డ్యూటీ. ఎలాంటి ఆంక్షలు లేకుండా మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పుడే జర్నలిస్టులు తమ డ్యూటీని సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వ మోసాలను బహిర్గతం చేయగలరు’ ఏకంగా 21 ఆస్కార్ నామినేషన్లు పొందిన ‘ది పోస్ట్’ సినిమాలో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక తరఫున అమెరికా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలివి. అమెరికా సుప్రీం కోర్టు చిత్తశుద్ధి చెక్కు చెదరకపోవడం వల్ల అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా, మీడియా స్వేచ్ఛకు అండగా అమెరికా సుప్రీం కోర్టు నిలబడగలిగింది. జడ్జీలు నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండడం వల్లనే సాధ్యమైంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మీడియాను ఆడిపోసుకుంటున్న సమయంలో చరిత్రలో మీడియా నిర్వహించిన సముచిత పాత్రను హైలెట్ చేస్తూ హాలివుడ్ సుప్రసిద్ధ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బెర్గ్ ఈ చిత్రాన్ని తీశారు. మహిళా ప్రాధాన్యత గల ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మెరిల్ స్ట్రీప్ నటించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం వియత్నాంపై మూడు దశాబ్దాలపాటు యుద్ధం చేసి చతికిలపడిన అమెరికా ప్రభుత్వం వైఖరేమిటో ‘పెంటగాన్ పేపర్స్ (అమెరికా సైనిక పత్రాలు)’ వాషింగ్టన్ పత్రిక పలు వ్యాసాలను ప్రచురించింది. వాటిని సహించలేని నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిస్సన్ ముందుగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికపై ఆంక్షలు విధించడంలో విజయం సాధిస్తారు. అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, కోర్టు ధిక్కార నేరం కింద పత్రిక పబ్లిషర్‌కు, సంపాదకునికి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ ‘ది వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వ్యాసాల ప్రచురణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పత్రిక అమెరికా కోర్టు బోను ఎక్కాల్సివస్తుంది. అప్పుడు మీడియాకు కోర్టు అండగా నిలబడుతుంది. పెంటగాన్ పత్రాలను 1970లో వెలుగులోకి తెచ్చిన వాషింగ్టన్ పోస్ట్, ఆ తర్వాత ‘వాటర్‌గేట్’ కుంభకోణాన్ని 1974లో వెలుగులోకి తెచ్చి ‘న్యూయార్క్ టైమ్స్’ భారత మీడియాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని, భారత సుప్రీం కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీం కోర్టు జడ్జీలందరూ ‘ది పోస్ట్’ సినిమా చూడాల్సిన అవసరం ఉందని సినిమా విమర్శకులు సూచిస్తున్నారు.