సాక్షి, హైదరాబాద్: మద్యం తాగినవారి రక్తంలో చేరే ఆల్కహాల్ శాతాన్నే బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్)గా చెప్తారు. సాధారణంగా ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30ఎంజీ (మిల్లీగ్రాములు) కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే వారికి మత్తు ఎక్కినట్టుగా భావిస్తారు. బీఏసీ 30 కంటే తక్కువగా ఉంటేనే వాహనాలు నడపొచ్చు. ఏమాత్రం ఎక్కువున్నా నడపడానికి వీల్లేదు. బీఏసీ 60కిపైగా ఉంటే వాహనాలపై అదుపుకోల్పోయే అవకాశం ఎక్కువ. అదే 90కిపైగా ఉంటే ప్రమాదకరమని.. 120–150 దాటితే అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెప్తున్నారు. బీఏసీ 150 దాటినవారి డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయడానికి, జైలుశిక్ష విధించడానికి అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment