హైదరాబాద్, సాక్షి: నగరంలో మందు బాబు ఒకడు హుషారుతనం చూపించాడు. డ్రంక్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా పోలీసులకు మస్కా కొట్టి ఏకంగా బ్రీత్‌అనలైజర్ మెషిన్‌తో ఉడాయించాడు. గురువారం రాత్రి బోయిన్‌పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment