breath analyser test
-
HYD: హుషారు తాగుబోతు.. బ్రీత్‌అనలైజర్‌తో పరార్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మందు బాబు ఒకడు హుషారుతనం చూపించాడు. డ్రంక్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా పోలీసులకు మస్కా కొట్టి ఏకంగా బ్రీత్అనలైజర్ మెషిన్‌తో ఉడాయించాడు. గురువారం రాత్రి బోయిన్పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిల్.. మహిళా పైలట్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మహిళా పైలట్ బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బోయింగ్ 787 విమానం ఫస్ట్ ఆఫీసర్‌గా మహిళా పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. ఇంతలో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్ 9) ధృవీకరించారు. సస్పెన్షన్‌కు గురైన మహిళా పైలట్ సోషల్ మీడియాలో పాపులర్ అని తెలుస్తోంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) రూల్స్ ప్రకారం ఆల్కహాల్ తీసుకున్న పైలట్లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్ ఉన్న మౌత్‌వాష్‌లు,టూత్ జెల్ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్ చేస్తారు. ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు -
డ్రంక్ అండ్ డ్రైవ్: తాగకున్నా.. తాగినట్టు..!!
సాక్షి, కంటోన్మెంట్ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రమాదాల నివరణకు సోమవారం అర్ధరాత్రి నగరవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకెటన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఇటీవల సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ జహిరూల్లా ఖాద్రి అనే యువకుడు మద్యం తాగకున్న తాగినట్టు బ్రీత్ అనలైజర్‌లో రీడిండ్ రావడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం రాత్రి కూడా అలాంటి ఘటనే జరిగింది. వివరాలు.. ఉప్పల్‌కు చెందిన నాగభూషణ్‌రెడ్డి (32) తాడ్బండ్లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలాఖరు కావడంతో ఆరోజు ఆఫీసులో ఆలస్యమైంది. అర్ధరాత్రి 12గంటల సమయంలో బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. (డ్రంక్ అండ్ డ్రైవ్.. తాగకున్న తాగినట్టు!) తాడ్‌బండ్ చౌరస్తా సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాగభూషణ్‌రెడ్డిని బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా భారీగా మద్యం తాగినట్టు రీడింగ్ వచ్చింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదుచేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఖంగుతిన్న నాగభూషణ్‌రెడ్డి తాను ఎలాంటి మద్యం సేవించలేదని ట్రాఫిక్ సిబ్బందికి చెప్పినా వారు వినిపించుకోలేదు. దీంతో బాధితుడు అప్పటికప్పుడు గాంధీ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు బాదితుడికి ‘క్లీన్ చిట్’ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదిక ఇచ్చారు. వైద్యులు ఇచ్చిన నివేదిక తీసుకుని నాగభూషణ్‌రెడ్డి మంగళవారం స్టేషన్‌కు వెళ్లగా.. పోలీసులు అతని వాహనాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయమై తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవిని వివరణ కోరగా.. బ్రీత్ అనలైజర్ పరీక్షలో నాగభూషణ్‌రెడ్డి మద్యం సేవించినట్లు నిర్దారణ అయిందనీ ఈ మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. -
ఊచలు లెక్కపెట్టాల్సిందే..
సాక్షి,మహబూబ్‌నగర్ క్రైం: ఇక నుంచి రోడ్లపైకి మద్యం సేవించి వాహనాలు నడుపుతే కఠినమైన కేసులతో పాటు.. పది నుంచి 60రోజుల జైలు శిక్ష విధించనున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఆటోలు, లారీలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఎక్కువమంది వాహనదారులు పట్టణంలో మద్యం కొనుగోలు చేసి బండమిదీపల్లి నుంచి తాటికొండ రోడ్డు వైపుతో పాటు, ఇటు నవాబ్‌పేట రోడ్డు ఫతేపూర్ మైసమ్మ పరిసర ప్రాంతాల వైపు.. హన్వాడ వైపు మద్యం తీసుకెళ్లి నిత్యం వందల సంఖ్యలో పార్టీ లు చేసుకుంటూ వస్తున్నారు. ఆదివారం రోజు అయితే సాయంత్రం సమయంలో తాటికొండ రోడ్డు వైపు వెళ్తే రోడ్డుకు ఇరువైపులా ఐదు.. నుంచి పది మంది వరకు బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా చెట్లకింద కూర్చోని మద్యం సేవిస్తూ కన్పింస్తుంటారు. ఎంత తాగితే ఎక్కువ.. బ్రీత్ అనలైజర్ ఆల్కహాల్‌లోని ఇథనాల్‌ను పసిగట్టే సెన్సార్ ఉంటుంది. ఇందులో కొన్ని రసాయన పదార్థాలను నిక్షిప్తం చేస్తారు. మద్యం తాగిన వ్యక్తి పరికరంలోకి గాలి ఊదినప్పుడు అతని శ్వాసలో కరిగి ఉన్న ఇథైల్ ఆల్కహాల్ సెన్సార్‌ను చేరుతుంది. ఇది శ్వాసలో ఇథనాల్ ఎంతశాతం ఉందో నమోదు చేస్తోంది. 0–30మిల్లీ గ్రాములు నమోదు సాధారణంగా చెబుతారు. 30మి.గ్రా ఆపైన నమోదైతే కేసు నమోదు చేసి జరిమానా వేస్తారు. ఇలా రెండుసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. 100మి.గ్రా పైగా నమోదైతే జైలుకు పంపుతారు. పోలీస్ నిబంధనల ప్రకారం.. ఒక యూనిట్ లేదా 100మిల్లీలీటర్ల రక్తంలో 0.03 శాతం లేదా 30మిల్లీ గ్రాములు మించి ఆల్కహాల్ ఉంటే.. మోటారు వాహనచట్టం 185 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తాగిన మోతాదును బట్టి రూ.2వేలు జరిమానా, వారం నుంచి పది రోజుల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని పునరావత్తం చేస్తే ఎక్కువ రోజులు జైలు శిక్షతో పాటు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు జరిమానా విధించే ప్రమాదం ఉంది. వినూత్నంగా శిక్షలు.. మొదట్లో డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో ఎక్కువ మోతాదులో తాగి దొరికిన వారికి జరిమానాతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టేవారు. ప్రస్తుతం చట్టాలకు మరింత పదునుపెట్టారు. మోతాదుకు మించి అతిగా తాగిన వారికి 5నుంచి 20రోజుల జైలు శిక్షలు విధించడం ప్రారంభం చేశారు. మళ్లీ మళ్లీ డ్రంకెన్‌డ్రైవ్‌లో దొరికిన వారికి గరిష్టంగా 35రోజుల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించి.. వారికి జీవో నం. 26ప్రకారం పాయింట్లు ఇస్తోంది. 24నెలల్లో 12పాయింట్లు దాటిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు చేస్తారు. ఏడాదిలో లైసెన్స్ పునరుద్ధరించాక మళ్లీ 12పాయింట్లు సాధిస్తే రెండేళ్లపాటు తర్వాత మళ్లీ ఇలాగే చేస్తే మూడేళ్లపాటు రద్దు చేస్తారు. ద్విచక్ర వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, నాలుగు చక్రాల వాహనదారుడు మద్యం తాగితే 4పాయింట్లు, బస్సు, క్యాబ్ వాహనదారుడు మద్యం తాగితే 5పాయింట్లు, ఆటో డ్రైవర్ తన పక్కన ప్రయాణికుడిని కూర్చొబెట్టుకుంటే, హెల్మెట్ లేకుంటే, సీటు బెల్టు పెట్టకుంటే 1పాయింటు వేస్తారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో 15రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 10రోజుల శిక్షపడిన వారు 12మంది, వారం రోజులు శిక్షపడిన వారు 51మంది, 35రోజుల శిక్షపడిన వారు ఇద్దరు, 30రోజుల శిక్ష పడిన వారు ఇద్దరు, 3రోజులు 87మంది, 5రోజులు 21మంది, 2రోజులు 34, ఒక్కరోజు జైలు శిక్షపడిన వారు నలుగురు ఉన్నారు. కేసులు పెరుగుతున్నాయి : జిల్లా కేంద్రంలో నిత్యం తనిఖీలు చేయడంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాం. అయినా కేసులు పెరుగుతున్నాయి. వాహనదారుల్లో చైతన్యం కలిగించినా మార్పు రావడం లేదు. పట్టుబడిన ప్రతిసారి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంవీ యాక్టును మరింత కఠినంగా చేయడంతో పాటు తనిఖీలు మరింత పెంచడం జరుగుతుంది. దీంతో పాటు డ్రంకెన్‌డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి పెడుతాం. ప్రతి వాహనదారుడు నిబంధనలు తెలుసుకోవాలి. రోడ్డుపై వాహనం నడిపే సమయంలో వాటిని పాటిస్తే ఎవరికి ఫైన్ కట్టాల్సిన అవసరం ఉండదు. – అమర్నాథ్రెడ్డి, ట్రాఫిక్ సీఐ -
వివాదాస్పదమైన ‘డ్రంక్ అండ్ డ్రైవ్’
-
డ్రంక్ అండ్ డ్రైవ్: తాగినట్టు రావడానికి కారణం ఇదే!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ పోలీసుల చేతిలో ఉండే బ్రీత్ అనలైజర్ (శ్వాస పరీక్ష యంత్రం) తొలిసారిగా వివాదాస్పదమైంది. సుల్తాన్‌బజార్ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడ ఐనాక్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జహీరుద్దీన్ ఖాద్రీ అనే వ్యక్తిని పరీక్షించగా...బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 43గా వచ్చింది. దీన్ని విభేదించిన ఆయన శాంతిభద్రతల విభాగం పోలీసుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వీటిలో ఆయన మద్యం తాగలేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై కోర్టు తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ (డీడీ) పరీక్షల నిర్వహణ ప్రారంభించి ఆరున్నరేళ్లు అయింది. ఇన్నేళ్ల కాలంలో ఇలా వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి. 2011 నవంబర్ నుంచి మొదలు... ‘నిషా’చరులను గుర్తించడానికి ఉద్దేశించిన డీడీ పరీక్షల్ని ట్రాఫిక్ పోలీసులు 2011 నవంబర్ 4 నుంచి ప్రారంభించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జైలు శిక్షలు విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తున్నారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులు గతంలో ‘నిషా’చరులను ర్యాష్ డ్రైవింగ్ (సెక్షన్ 184 బి) కిందే నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. 2011 నుంచి మాత్రం సెక్షన్ 185 ప్రకారం బుక్ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్ అనలైజర్ నుంచి వచ్చిన ప్రింట్ అవుట్‌ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడతారు. ఈ ఉల్లంఘనకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు న్యాయస్థానం ఫైన్ వేస్తుంది. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం సేవించాడని న్యాయమూర్తి భావిస్తే గరిష్టంగా 2 నెలల వరకు జైలు శిక్షకూ అవకాశం ఉంది. రెండోసారీ ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే...రూ. 3 వేల ఫైన్ లేదా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఆ చట్ట ప్రకారం ఉంది. ప్రస్తుతం నగర ట్రాఫిక్ పోలీసులు 30కి బదులు 35 కౌంట్ వస్తేనే ఉల్లంఘనగా పరిగణించి కేసు నమోదు చేస్తున్నారు. ఇటీవలే కొన్ని మార్పులు సైతం... డీడీ పరీక్షల కోసం వినియోగిస్తున్న శ్వాసపరీక్ష యంత్రాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినవి అని నగర ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఫలితంగానే పరీక్ష తర్వాత దీని నుంచి ప్రింట్ ఔట్‌ను ఆధారంగా న్యాయస్థానాలు సైతం అంగీకరిస్తున్నాయని అంటున్నారు. ఈ యంత్రాల్లో ఇటీవలే కొన్ని మార్పులు చేస్తూ వెనుక వైపు క్లాంప్స్ సైతం ఏర్పాటు చేశారు. పరీక్ష చేయాల్సిన వ్యక్తి నుంచి బ్రీత్ ఎనలైజర్‌కు పైన ఉండే పైప్‌లో గాలి ఊదిస్తారు. ఈ గాలి యంత్రం లోపలికి వెళ్ళి.. వెనుక ఉండే రంధ్రం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ కాలంలోనే యంత్రం శ్వాస పరీక్ష ద్వారా మద్యం తాగింది? లేనిది? ఎంత తాగారనేది? లెక్కించి చెప్తుంది. ఓ వ్యక్తిని పరీక్షించడానికి, మరో వ్యక్తిని పరీక్షించడానికి మధ్యలో ఒకరు ఊదిన గాలి... యంత్రం నుంచి పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. అయితే విధి నిర్వహణలో ఉంటున్న అధికారుల నిర్లక్ష్యం, కొన్ని సందర్భాల్లో ఉద్దేశపూర్వక చర్యల కారణంగా ఇలా రావట్లేదు. వీరి వేలు వెనుక ఉన్న రంధ్రంపైకి వెళ్తుండటంతో కొంత గాలి లోపలే ఉండిపోతోంది. అలా గాలి నిలిచిపోయిన యంత్రంతో మరో వ్యక్తిని పరీక్షిస్తే అది ఆ వ్యక్తి శ్వాసలో కలిసిపోతోంది. దీంతో అతడు మద్యం తాగకపోయినా తాగినట్లు, తాగిన వ్యక్తికి ఎక్కువ మోతాదులో చూపించే ఆస్కారం ఉంది. దీనికి సంబంధించి కొన్ని ఫిర్యాదులూ వచ్చాయి. దీంతో ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఇటీవలే వెనుక రంధ్రం మూయడానికి ఆస్కారం లేకుండా ప్రత్యేకంగా క్లాంప్స్ ఏర్పాటు చేయించారు. ఆ నివేదికనున్యాయస్థానం అంగీకరిస్తుందా..? ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన జహీరుద్దీన్ ఉదంతం తొలిసారిగా కొత్త వివాదాన్ని సృష్టించింది. ఇతడిని పోలీసులు పరీక్షించగా 43 బీఏ(బ్లడ్ ఆల్కహాల్) కౌంట్ రాగా.. వైద్యుల పరీక్షలో మద్యం తాగలేదని వచ్చింది. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు సైతం సీరియస్‌గా తీసుకున్నారు. ఓ వ్యక్తి మద్యం తాగాడా? లేదా? అనేది నిర్థారించడానికి వైద్యులు రక్త నమూనాలు సేకరించి కిట్స్ సాయంతో పరీక్షించాల్సి ఉందని చెప్తున్నారు. అయితే జహీరుద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు అలా చేయలేదని, కేవలం మాన్యువల్ టెస్ట్‌లతోనే నివేదిక ఇచ్చేశారని పేర్కొంటున్నారు. డీడీ పరీక్షల్లో చిక్కిన ప్రతి వ్యక్తి నుంచి వాహనం స్వాధీనం చేసుకుంటామని కౌన్సిలింగ్ అనంతరం కోర్టులో అతడిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామని చెప్తున్నారు. న్యాయస్థానం విధించిన జరిమానా చెల్లించడం, శిక్ష పూర్తి చేసుకోవడం జరిగిన తర్వాతే వాహనాన్ని తిరిగి ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రతి కేసు మాదిరిగానే జహీరుద్దీన్ వ్యవహారంలోనూ కోర్టులో చార్జ్‌షీట్ వేస్తామని చెప్తున్నారు. ఆయన తన అభ్యంతరాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లవచ్చని సూచిస్తున్నారు. ఇదే జరిగితే న్యాయస్థానం ఉస్మానియా వైద్యులు ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని అంగీకరిస్తుందా? లేదా? అనేది కీలకంగా మారింది. కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే డీడీ పరీక్షల చెల్లుబాటు, వాటి కచ్చితత్వాలపై ఓ స్పష్టత రానుంది. -
పల్లెల్లో మద్యం పడగ
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : నిండు వర్షాకాలంలో మంచి నీటి ఎద్దడి ఎదుర్కొనే పల్లెలు ఉండొచ్చేమో గాని.. మద్యానికి మాత్రం ఎలాంటి కొదువ లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపుతూ.. పెద్దఎత్తున దాడులు చేయిస్తోంది.. వ్యాపారులు, తయారీదారులపై పీడీ యాక్టు అమలుచేస్తోంది. ఫలితంగా సారా తయారీ, అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బెల్టు దుకాణాలు ఆక్రమించాయి. ఏ మూల చూసినా అవే దర్శనమిస్తున్నాయి. వీటిపై నియంత్రణ కొరవడడంతో పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. కిరాణం, శీతల పానీయాల దుకాణాలు, హోటళ్లు, పాన్ డబ్బాల్లో మద్యం వాసన గుప్పుమంటోంది. ఇంత జరుగుతున్నా ఆబ్కారీ, పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బెల్టుల సాయంతో అక్రమార్జన మహబూబ్‌నగర్ జిల్లాలో బెల్టు దుకాణాల సం ఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మద్యం వ్యాపారులు ఎక్కువ శాతం ఈ దుకాణాలపైనే దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో 66 వైన్స్ దుకాణాలుండగా ఒక్కోదానికి సగటున 20 నుంచి 40 బెల్టు దుకాణాలతో సంబంధాలుండటం విశేషం. మరికొంద రు దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి పల్లెల్లో ఇళ్ల దగ్గర, చిన్నపాటి హోటళ్లు, కిరాణ దుకాణాల్లో దర్జాగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మార్పీ పేరుతో బోర్డులు తగిలిస్తున్న వ్యాపారులు బెల్టుల సాయంతో అక్రమార్జనకు తెరలేపుతున్నారు. ప్రతి రోజు వైన్స్‌తో సమానంగా బెల్టు దుకాణాల్లో వ్యా పారం సాగుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకో వచ్చు. జిల్లాలో బెల్టు దుకాణాల ద్వారా నిత్యం రూ.50 లక్షల వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలు స్తోంది. ప్రత్యేకంగా కొన్ని వైన్స్ దుకాణాలు ఇదే పనిగా ముందుకు సాగుతున్నాయి. అధికారికంగా డిపో నుంచి సరుకు తెచ్చుకుని రికార్డుల్లో నమో దు చేస్తూ బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. నాసికరం మద్యం.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు నాసిరకం మద్యానికి దారి తీస్తున్నాయి. వైన్స్ దుకాణాల నుంచి తీసుకొచ్చిన దానికి దుకాణదారులకు చెల్లించిన దానికంటే అదనంగా రూ.20 నుంచి రూ.30 ధర పెంచి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా సీసాల్లో మద్యాన్ని తొలగించి నీళ్లు కలుపుతున్నారు. బెల్టు దుకాణాల్లో బీర్లు కొనుగోలు చేయాలన్నా అదనంగా రూ.40 చెల్లించాల్సిందే. ఎక్కువ శాతం చీప్‌లిక్కర్ తాగే వారి కోసం బెల్టు దుకాణాల్లో కొన్ని బ్రాండ్లను అసలు ధర కంటే అదనంగా రూ.40కి విక్రయాలు సాగిస్తున్నారు. జిల్లాలో సుమారు 2 వేల కంటే ఎక్కువ సంఖ్యలో బెల్టు దుకాణాలు గల్లీగల్లీలో విస్తరించాయి. బెల్టు దుకాణారులకు మద్యాన్ని సరఫరా చేయడంతో సిండికేటు దందా సాగించే వారికి రోజువారీగా సగటున రూ.20 లక్షల ఆదాయం అదనంగా సమకూరుతోందని అంచనా. రూ.లక్షలు వెచ్చించి టెండర్ల ద్వారా దుకాణాలు దక్కించుకున్నందుకు లాభసాటిగా ఉండాలనే తాపత్రయంతో నిలువునా ముంచేస్తున్నారు. మరోపక్క అదనంగా డబ్బులు చెల్లించి బెల్టు దుకాణాలను కొనసాగించినందుకు మాకు లాభం లేకపోతే ఎలా? అనే ధోరణితో బెల్టు దుకాణం నకిలీ మద్యంతో మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేబుల్స్ తొలగించి విక్రయాలు ఎక్సైజ్ అధికారులు నిబంధనలు మాత్రం బేషుగ్గా ఆదేశిస్తున్నారు. మద్యం సీసాలను ఏ దుకాణానికి ఏ లేబుల్‌తో పంపిణీ చేశారో అధికారికంగా రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు. ఆ దుకాణానికి సరఫరా చేసిన సీసాలను అక్కడే విక్రయించాలనే ఆదేశాలు సైతం జారీచేశారు. ప్రత్యేకంగా ఒక్కో దుకాణానికి ఒక్కో కోడ్‌ను కేటాయించారు. ఈ తతంగమంతా మద్యం గొలుసుకట్టు దుకాణాల విస్తరణకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే. ఆచరణలో చూస్తే కేవలం కాగితాలకే ఆ నిబంధనలను పరిమితం చేసి అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీధుల్లో మద్యం ఏరులై పారుతోంది. మరో పక్క ఏంచక్కా సీసాలకు ఉన్న లేబుల్స్‌ను తొలగించి విచ్చలవిడిగా బెల్టు దుకాణాలకు తరలిస్తున్నారు. ఎక్కడికక్కడ కూర్చోబెట్టి.. గ్రామాల్లో ఎక్కడ పడితే సిట్టింగ్ రూంలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల పోలీసులు ఏకంగా వైన్స్ సిట్టింగ్ రూంల వద్ద వాహనాలు తనిఖీ చేసి, బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేసి కేసులు చేస్తున్నారు. దీంతో మందుబాబులు ప్రధాన మద్యం దుకాణాలను వదిలి గ్రామాల బాట పడుతున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం విక్రయాలకు అనేక నిబంధనలున్నాయి. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేపట్టాలి. నిల్వ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. కంప్యూటరైజ్ స్కానింగ్ చేయాలి. దీంతో ఏ రకం ఎక్కడి నుంచి ఎంత మొత్తంలో విక్రయించింది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దమొత్తంలో ఒకేసారి మద్యం విక్రయాలు చేస్తే సంబంధిత దుకాణంపై నిఘా ఉంచుతారు. అయితే జిల్లాలో ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదని తెలుస్తోంది. బెల్టు దుకాణాల్లో మద్యంతోపాటు నీటి ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు సైతం విక్రయిస్తూ అక్కడే మద్యం తాగేలా ప్రోత్సహిస్తున్నారు. -
ఖాకీలకు చుక్కలు చూపించిన మహిళ
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగ చౌరస్తాలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఓ మహిళ వ్యాపారవేత్త పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్ రోడ్‌నెం.3లో నివసించే యువ వ్యాపారవేత్త మద్యం తాగి తన ఆడికారు నడుపుకుంటూ వస్తుండగా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపేందుకు యత్నించగా వేగంగా ముందుకు పోనిచ్చింది. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా ఆమె అడ్డుకోవడమే కాకుండా ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా చిందులు తొక్కింది. అతికష్టం మీద పోలీసులు ఆమెకు శ్వాస పరీక్ష నిర్వహించగా పరిమితికి మించి మద్యం తాగి ఉన్నట్టు నిర్థారణైంది. దీంతో కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్‌లో అతిగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 20 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కార్లు, 9 బైక్‌లు, ఒక ఆటో ట్రాలీ ఉన్నాయి. పట్టుబడ్డ వాహనదారులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు.