Breath analyser
-
HYD: హుషారు తాగుబోతు.. బ్రీత్‌అనలైజర్‌తో పరార్
హైదరాబాద్, సాక్షి: నగరంలో మందు బాబు ఒకడు హుషారుతనం చూపించాడు. డ్రంక్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా పోలీసులకు మస్కా కొట్టి ఏకంగా బ్రీత్అనలైజర్ మెషిన్‌తో ఉడాయించాడు. గురువారం రాత్రి బోయిన్పల్లి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ మందుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టడం ఎలా?
పండుగ సీజన్, న్యూ ఇయర్ లాంటివి వచ్చినప్పుడు భారత్‌లో డ్రైంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. తాగి వాహనాలు నడపడం వల్ల ఒక్కోసారి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 1న ఢిల్లీ కంఝవాలలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మద్యం మత్తులో బండ్లు నడిపి వాళ్ల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు కొందరు. భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు కఠిన శిక్షలే ఉన్నాయి. తాగి బండి నడిపితే రూ.10వేలు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష. రెండోసారి ఈ తప్పు చేస్తే రూ.15వేల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తున్నారు. బ్రిటన్, స్వీడన్ సహా పలు దేశాల్లో ఇలాంటి కఠిన శిక్షలే అమలు చేస్తున్నారు. బ్రిటన్‌లో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి అధికారులు ఎంత పెనాల్టీ అయినా విధించవచ్చు. దీనికి పరిమితే లేదు. నిబంధనలు ఇంత కఠినంగా ఉన్నా కొంతమంది వాహనదారులు అసలు లెక్కచేయడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడతామన్న భయం లేకుండా యథేచ్ఛగా మద్యం సేవించి బండ్లు నడుపుతున్నారు. ఎలాగోలా తప్పించుకోవచ్చనో, లేక దొరికినా బయటకు రావచ్చనే ధీమానో తెలియదు గానీ భారత్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు పండుగ సీజన్లలో, సెలవు దినాల్లో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా టెక్నాలజీతో చెక్? మిగతా దేశాల సంగతి ఎలా ఉన్నా.. ఆస్ట్రేలియాలో మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్‌ను కట్టడి చేసేందుకు వినూత్న సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 'ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ సిస్టమ్' పేరుతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.. ఈ వ్యవస్థ ఉన్న కార్లు స్టార్ అవ్వాలంటే డ్రైవర్ కచ్చితంగా బ్రీత్ ఎనలైజర్ ఊదాలి. అతడు ఆల్కహాల్ సేవించలేదని నిర్ధరించుకున్నాకే కారు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బ్రీత్ ఎనలైజర్ సాంపిల్‌లో ఆల్కహాల్ ఉన్నట్లు తేలితే కారు స్టార్ట్ అవ్వదు. డ్రైవర్లు చీటింగ్ చేయకుండా బ్రీత్ ఎనలైజర్ సాంపిల్ ఇచ్చే సమయంలో ఫొటో తీసే విధంగా ఈ టెక్నాలజీని రూపొందించారు. ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ వ్యవస్థ ఆస్టేలియాలో సత్ఫలితాలనే ఇచ్చింది. రోడ్డు భద్రతకు ఇది చాలా ముఖ్యమని 2021లో 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా ఇలాంటి సాంకేతికతను తీసుకువస్తే డ్రంక్ డ్రైవ్ ఘటనలను అరికట్టి ప్రమాదాలను నివారించవచ్చని అంతా భావిస్తున్నారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి? -
తాగకపోయినా... తాగినట్టే మత్తుగా ఉంటుందా? ఆ జబ్బేంటో తెలుసా?
ఒకవేళ ఎవరికైనా ఈ జబ్బు ఉందంటే... పొరబాటున వారు వాహనం నడిపేటప్పుడు పోలీస్ చెకింగ్ గానీ జరిగిందంటే... అది వారి పాలిట సమస్యే అవుతుంది. నిజానికి వారు మద్యం తాగకపోయినప్పటికీ... బ్రెత్ అనలైజర్‌తో పరీక్ష చేశారంటే మద్యం తాగితే వచ్చే ఫలితమే కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘‘డ్రంకెన్నెస్ డిసీజ్’’ అంటారు. ఎందుకు జరుగుతుందంటే...? ఈ జబ్బు ఉన్నవారిలో వాళ్లు తిన్న కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) ఎప్పటికప్పుడు ఆల్కహాల్‌గా మారిపోతుంటాయి. అందుకే ఈ వైద్య సమస్యను ‘బీర్ గట్’ (బీరుతో నిండిన కడుపు / కడుపు నిండా బీరు) లేదా గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ / ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఈ పరిస్థితి కారణంగా తాగక పోయినా మత్తు వచ్చేస్తుంది. అవాంఛితమైన ఆ మత్తు కారణంగా ప్రమాదాలూ జరగవచ్చు. బాధితులలో భౌతికంగా కూడా చాలా సమస్యలూ వస్తుంటాయి. ఉదాహరణకు మద్యం తాగినప్పుడు చాలామందిలో కనిపించే లక్షణమైన నోరంతా ఎండిపోవడంతో పాటు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, దీర్ఘకాలికంగా నిస్సత్తువ ఉండటం వంటివెన్నో కనిపిస్తాయి. దాని వల్ల డిప్రెషన్లోకి కూడా జారిపోవచ్చు. వాళ్ల జీర్ణకోశంలో ఉండే ‘శాకరోమైసిస్ సెరివిసీ’ అనేఒక రకమైన సూక్ష్మజీవి వల్ల ఇలా జరుగుతుంది. చికిత్స ఏమిటి? పిండిపదార్థాలను పూర్తిగా నివారించడం, అలాగే బాధితులకు ఎప్పుడూ హై ప్రోటీన్ ఆహారాన్ని ఇవ్వడంలాంటి ‘డైట్ థెరపీ’తో డాక్టర్లు ఈ సమస్యకు చికిత్స అందిస్తారు. కొందరికి యాంటీ ఫంగల్ / యాంటీ బ్యాక్టీరియల్ మందుల చికిత్స అవసరమవుతుంది. శాకరోమైసిస్ సెరివిసీ అనేది ఈస్ట్ లాంటి మైక్రోబ్ వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి డాక్టర్లు యాంటీఫంగల్ మందులతో, సూక్ష్మజీవులను అరికట్టే యాంటీ బయాటిక్స్తోనూ ఈ సమస్యను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. -
మద్యం మత్తులో బ్రీత్ ఎనలైజర్ ఎత్తుకెళ్లి..
టీ.నగర్: అడయార్ సమీపంలో శనివారం కారులో ప్రయాణిస్తున్న మందుబాబు పోలీసుల నుంచి బ్రీత్ ఎనలైజర్ లాక్కుని పరారయ్యాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకుని బ్రీత్ అనలైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై వేలచ్చేరికి చెందిన భూషణ్ అన్నావర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు శనివారం తన లగ్జరీ కారులో అడయార్ వైపుగా వెళుతుండగా సత్యా స్టూడియో సమీపంలో ట్రాఫిక్ పోలీసులు కారును నిలిపి తనిఖీ జరిపారు. ఆ సమయంలో భూషన్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు బ్రీత్ ఎనలైజర్‌తో అతన్ని పరీక్షించేందుకు ప్రయత్నించగా అతడు దాన్ని లాక్కుని కారులో ఉడాయించాడు. దీంతో పోలీసులు సమీప ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేశారు. భూషణ్ కారును వెంబడించి అతని వద్ద నుంచి బ్రీత్ ఎనలైజర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసి అభిరామపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. -
తాగకున్నా తాగినట్లు చూపితే ఎలా?
సాక్షి,ఆత్మకూరు: బ్రీత్ ఎనలైజర్ పరికరంలోని లోపం ఆర్టీసీ డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. మద్యం అంటే ఏమిటో ఎరుగని కార్మికులను తాగినట్లుగా చూపించడంతో కార్మికులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకంది. వివరాలివి.. చల్లా రవిరెడ్డి ఆత్మకూరు డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ ఎక్కుతున్న రవికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేశారు. అతను మద్యం సేవించినట్లు 10 పాయింట్లు నమోదవడంతో సస్పెండ్ చేసేందుకు డిపో అధికారులు సిద్ధమయ్యారు. మళ్లీ పరీక్ష చేయాలి.. దీంతో సహ కార్మికులు అసలు మద్యం ముట్టని రవిని మద్యం సేవించాడని నిర్ధారించడం సరికాదని వాగ్వాదానికి దిగారు. మళ్లీ పరీక్ష చేయాలని కోరగా అధికారులు ససేమిరా అన్నారు. విషయం తెలిసి అన్ని కార్మిక యూనియన్ల నాయకులు అక్కడికి చేరుకుని అనుమానం ఉంటే ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించాలని కోరారు. అలా కుదరిని పక్షంలో అదే పరికరంతో మళ్లీ పరీక్షించాల్సిందేనని పట్టుబట్టారు. ధర్నాకు దిగిన కార్మిక జేఏసీ.. యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆకస్మిక దర్నా చేపట్టారు. అప్పటికి డిపో నుంచి కేవలం ఒక్క బస్సు మాత్రమే బయటకు వెళ్లింది. అయితే మిగిలిన బస్సులను కదనివ్వబోమంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. డిపో మేనేజర్ త్రినాథరావు వచ్చి బ్రీత్ ఎనలైజర్ ద్వారా రెండోసారి పరీక్షలకు నిబంధనలు ఓప్పుకోవన్నారు. మద్యం అలవాటే లేని కార్మికులను తాగుబోతులుగా చూపుతున్న బ్రీత్ ఎనలైజర్‌ను మార్చాలని, న్యాయం జరిగే వరకు దర్నా విరమించేది లేదని కార్మికులు పట్టుబట్టారు. దీంతో మూడు గంటలకుపైగా బస్సులు డిపోలోనే నిలిచిపోయాయి. దిగొచ్చిన డీఎం.. విషయం తెలుసుకుని డిపోకు వచ్చిన మీడియాపై డీఎం త్రినాథరావు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని కోపం ప్రదర్శించారు. చివరకు ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడి అందరి ఎదుట డ్రైవర్ రవిని రెండోసారి పరీక్షించగా సున్న(0)గా నమోదైంది. మిషన్‌లో పొరపాటు పెట్టుకుని కార్మికులను క్షభకు గురిచేయడం తగదని కార్మిక జేఏసీ అన్నారు. గతంలోనూ ఇలానే ఒకరిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు ధర్నా విరమించారు. కాగా, ఈ సంఘటనపై డీఎం త్రినాథరావును ప్రశ్నించగా రెండవసారి కార్మికుడు అధికంగా నీళ్లు తాగి పరీక్షలు చేయించకోవడంలో అలా నమోదైందని వ్యాఖ్యానించారు. -
ఇక బార్లలోనూ బ్రీత్ ఎనలైజర్లు..
సాక్షి, చండీగఢ్ : బార్లు, పబ్‌లలో బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసుకోవాలని చండీగఢ్ కేంద్ర పాలితప్రాంత యంత్రాంగం వాటి నిర్వాహకులకు సూచించింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా బ్రీత్ ఎనలైజర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఇటీవల (ఈ నెల 6న) ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి దీనిపై వివరాలు అందించాలని ఆదేశించింది. మందుబాబులు నిర్దేశిత డోస్‌లోనే తాగారా లేదా అని తెలుసుకోవాలని, అదే మితిమీరి తాగితే వారు వాహనం నడపకుండా చూడాలని అధికారులు తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ ఏర్పాటు మంచిదే అయితే, మద్యం వినియోగదారులు ఎంత మొత్తం తాగాలనేది తామెలా నిర్ణయిస్తామని బార్లు, పబ్‌ల యజమానులు అంటున్నారు. మందుబాబులపై తామెలా పోలీసింగ్ చేయగలగమని ప్రశ్నిస్తున్నారు. మితిమీరి తాగిన వారిని ట్యాక్సీతో ఇళ్లకు పంపే ఏర్పాటు చేయగలమని, నిర్దేశించిన వేరకే తాగాలని ఎలా అదుపు చేయగలమని అధికారులను అడిగారు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో మద్యం సరఫరా చేసే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు దాదాపు 100 వరకు ఉన్నట్లు సమాచారం. -
మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్తత
నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిపోలో పని చేస్తున్న సెక్యూరిటీ ఎస్సై ... బస్సు డ్రైవర్లతో అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా కార్మికులు శుక్రవారం అర్థరాత్రి విధులు బహిష్కరించి.. డిపో ఎదుట ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ ఎస్సై దామోదర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు తమకు బ్రీత్ ఎన్లైజర్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినా.. సేవించకపోయినా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు బ్రిత్ ఎన్లైజర్ సూచిస్తోంది. దీంతో ఆర్టీసీలోని అన్ని సంఘాల కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము తప్పు చేసినట్లు రుజువు అయితే మెడికల్‌కు పంపించి సస్పెండ్ చేయండి తప్పా.. అనవసరంగా నిందలు వేయడం తగదని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
జయప్రద కారు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైంజిగ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఫిలింనగర్ రోడ్‌నంబర్ 1లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఎనిమిది ద్విచక్ర వాహనాలు, ఆరు కార్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసులు నమోదైన వారికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. రాత్రి ఓ విందులో పాల్గొని సినీ నటి జయప్రద తన కారులో ఇంటికి బయల్దేరారు. ఆమె కారు డ్రైవర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్టు నిర్వహించారు. అయితే డ్రైవర్ మద్యం సేవించలేదని నిర్ధారణ అయ్యింది. -
బ్రీత్‌ఎనలైజర్లు లేకుండా..ప్రమాదాల నివారణా?
విజయనగరం ఫోర్ట్: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అధికప్రమాదాలు జరుగుతున్నాయిని భావించిన సర్కారు బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. అందుకు తగ్గ పరికరాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. జిల్లాలో ఐదుగురు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో బ్రీత్ ఎనలైజర్ ఉండాలి. బ్రీత్ ఎనలైజరు ఖరీదు రూ.52వేలు. ఐదు ఎనలైజర్లను కొనుగోలు చేయడానికి నిధులు విడుదల చేయాలంటూ రవాణాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలుకు నిధులు లేవు. మీరే ఏదోవిధంగా కొను గోలు చేసుకోవాలని ప్రభుత్వం సెలవిచ్చినట్టు భోగట్టా. దీంతో బ్రీత్ ఎనలైజర్లు లేకుండా ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమంటూ రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజరు ఏవిధంగా కొనుగోలు చేయాలనే అలోచనతో అష్టకష్టాలు పడి ఒక బ్రీత్ ఎనలైజరును కొనుగోలు చేశారు. ఇంకా నాలుగు బ్రీత్ ఎనలైజర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. బ్రీత్ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తించవచ్చు. మద్యం తాగి పట్టుబడితే తొలిసారి రూ. 2వేలు, రెండోసారి రూ. 3వేలు అపరాధ రుసుం విధిస్తారు. దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. ఇదే విషయాన్ని ఇన్చార్జ్ ఆర్టీఓ శివప్రసాద్‌రావు వద్దప్రస్తావించగా బ్రీత్‌ఎనలైజర్స్ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయని మాటవాస్తవమేనని అంగీకరించారు.