ఇక బార్లలోనూ బ్రీత్ ఎనలైజర్లు..
ఇక బార్లలోనూ బ్రీత్ ఎనలైజర్లు..
Published Thu, Sep 7 2017 8:26 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
సాక్షి, చండీగఢ్ : బార్లు, పబ్‌లలో బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసుకోవాలని చండీగఢ్ కేంద్ర పాలితప్రాంత యంత్రాంగం వాటి నిర్వాహకులకు సూచించింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా బ్రీత్ ఎనలైజర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఇటీవల (ఈ నెల 6న) ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి దీనిపై వివరాలు అందించాలని ఆదేశించింది.
మందుబాబులు నిర్దేశిత డోస్‌లోనే తాగారా లేదా అని తెలుసుకోవాలని, అదే మితిమీరి తాగితే వారు వాహనం నడపకుండా చూడాలని అధికారులు తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ ఏర్పాటు మంచిదే అయితే, మద్యం వినియోగదారులు ఎంత మొత్తం తాగాలనేది తామెలా నిర్ణయిస్తామని బార్లు, పబ్‌ల యజమానులు అంటున్నారు. మందుబాబులపై తామెలా పోలీసింగ్ చేయగలగమని ప్రశ్నిస్తున్నారు. మితిమీరి తాగిన వారిని ట్యాక్సీతో ఇళ్లకు పంపే ఏర్పాటు చేయగలమని, నిర్దేశించిన వేరకే తాగాలని ఎలా అదుపు చేయగలమని అధికారులను అడిగారు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో మద‍్యం సరఫరా చేసే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు దాదాపు 100 వరకు ఉన్నట్లు సమాచారం.
Advertisement