Bar and Pubs
-
తాగుబోతు వీరంగం.. 15 మంది సజీవ దహనం!
మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన అతి.. రష్యాలో పదిహేను మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేయసితో నైట్‌క్లబ్‌కు వచ్చి తప్పతాగి.. ఆ జోష్‌లో వీరంగం సృష్టించాడతను. ఈ క్రమంలో డ్యాన్స్ ఫ్లోర్‌పై ఫ్లేర్ గన్ ప్రయోగించడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిహేను మంది సజీవదహనం అయ్యారు. మాస్కోకు 300 కిలోమీటర్ల దూరంలోని కోస్ట్రోమా నగరంలోని ఓ బార్ అండ్ కేఫ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పదిహేను మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సహాయక సిబ్బంది. గాయపడిన ఐదుగురికి చికిత్స అందుతోందని రష్యా న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్ కథనం ప్రచురించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2గంటల ప్రాంతంలో పొలిగాన్ బార్లో అగ్ని రాజుకుంది. మొత్తం బిల్డింగ్ కూలే ప్రమాదం ఉండడంతో.. అతికష్టం మీద ఐదున్నర గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. ప్రేయసితో పాటు బార్‌కు వచ్చిన సదరు వ్యక్తి.. ఆమెకు పూలు ఇచ్చి కాసేపు సరదాగా గడిపాడు. ఆపై మద్యం మత్తులో రెచ్చిపోయి.. విచిత్రంగా ప్రవర్తించాడు. 15 Dead in #Russian #NightClub Inferno A huge blaze filled the sky of the historic town of #Kostroma, claiming the lives of at least 15 with 5 others seriously injured. More than 250 people have been rescued, local authorities claim. pic.twitter.com/CTkSrxjRnv — आशिष वैद्य 🇮🇳🚩 (@iAshishSVaidya) November 5, 2022 అక్కడే ఉన్న కొందరితో గొడవకు దిగారు. చివరకు డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కి.. చేతిలో ఉన్న ఫ్లేర్ గన్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఘటన సమయంలో ఎమర్జెన్సీ డోర్లు పని చేయలేదన్న విమర్శ సైతం వినిపిస్తోంది. -
పార్లమెంట్‌లోని బార్లలో పొంగుతున్న బీర్లు
రోజు రోజుకు విజంభిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం శనివారం నుంచి మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా ఇంగ్లండ్‌లోని అన్ని పబ్‌లను, బార్లను, రెస్టారెంట్లను రాత్రి పది గంటలకల్లా కచ్చితంగా మూసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పబ్‌లో, బార్లలో కూడా ఒక చోట ఎనిమిది మందికి మించి గుమికూడరాదంటూ, విధిగా మాస్కులు ధరించాలంటూ, పబ్‌లు, బార్లకు వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్లు, చిరునామాలను నిర్వాహకులు తీసుకోవాలంటూ కూడా నిబంధనలు విధించింది. అయితే కొంత మంది ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ ఆంక్షల నుంచి ఇంగ్లండ్ పార్లమెంట్‌లోని బార్లను ‘వర్కింగ్ ప్లేస్ క్యాంటీన్’ కేటగిరీ కింద మినహాయించింది. పార్లమెంట్ ఆవరణలో మొత్తం 30 బార్లు ఉన్నాయి. వీటిలో కొన్ని గెస్ట్‌లను అనుమతించే బార్లు ఉండగా, జర్నలిస్టులను అనుమతించే బార్లు కొన్ని ఉన్నాయి. కొన్ని బార్లలో ఎంపీలకు మాత్రమే అనుమతి ఉంది. ది లార్డ్స్ బార్, ది బిషప్స్ బార్, దీ పీర్స్ డైనింగ్ రూమ్, ది పీర్స్ గెస్ట్ రూమ్, ది పూజిన్ రూమ్, ది టెర్రేస్ పెవీలియన్, ది స్ట్రేంజర్స్ బార్, ది టెర్రేస్ కాఫెటేరియా, ది థేమ్స్ పెవీలియన్, ది స్పీకర్స్ స్టేట్ రూమ్స్, ది రివర్ రెస్టారెంట్, బెల్లమీస్, ది డిబేట్, ది జూబ్లీ రూమ్, ది అడ్జెర్న్‌మెంట్, ది మెంబర్స్ డైనింగ్ రూమ్, ది స్ట్రేంజర్స్ డైనింగ్ రూమ్, ది స్పోర్ట్స్ అండ్ సోషల్ బార్, ది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ రూమ్, ది చర్చిల్ రూమ్, ది కోల్‌మాండ్‌లే రూమ్, ది బెర్రీ రూమ్, ది హోం రూమ్, జూబ్లీ కేఫ్, ది అట్లీ రూమ్, మిల్‌బ్యాంక్ హౌజ్ కేఫ్టేరియా, ది రివర్ డైనింగ్ రూమ్స్, మాన్‌క్రీఫ్స్‌లలో బార్లు ఉన్నాయి. వీటిలో మాన్‌క్రీఫ్స్ జర్నలిస్టులకు ప్రత్యేకం. ఇవి ఎప్పటిలాగే రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తాయి. (చదవండి: ఆసక్తికర విషయాలు వెల్లడించిన బ్రిటన్ పరిశోధకులు) వీటిలో మూడు డాలర్లకు ఒక్క బీరు చొప్పున సబ్సిడీపై అందజేస్తున్నారు. ఫలితంగా ఏటా 8 మిలియన్ డాలర్ల సబ్సిడీ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతోంది. 1980లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ఎంపీల్లో ఎక్కువ మంది తాగే వారు ఉండగా, వారిలో పది శాతం మంది ఎక్కువ తాగడమే కాకుండా చికిత్స కోసం రీహాబిలిటేషన్ సెంటర్లకు వెళతారట. దివంగత లిబరల్ డెమోక్రటిక్ నాయకుడు చార్లెస్ కెన్నడీ ఓ సారి బాగా తాగి బడ్జెట్ సెషన్‌కు వెళ్లి ప్యాంట్లో మూత్రం పోసుకున్నారట. అప్పుడు ఆయన్ని పార్లమెంట్ భద్రతా సిబ్బంది తీసుకెళ్లి ఆయన కార్యాలయంలో నిర్బంధించి, బయటి నుంచి తాళం వేశారట. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తాగి, తాగి చనిపోయారట. 2013లో లేబర్ ఎంపీ ఎరిక్ జాయిస్‌ను పార్లమెంట్ బారుల్లోకి అనుమతించకుండా నిషేధం విధించారు. తాగి పార్లమెంట్ సెషన్‌కు వెళ్లి తనతో విభేదించిన ఎంపీలను తలతో ‘డిచ్’ కొట్టడమే అందుకు కారణమట. అలా ఆయన ఆరుగురు ఎంపీల తలలు పగులగొట్టారట. పార్లమెంట్లో ఇన్ని బార్లు ఎందుకు అనే అంశం పలు సార్లు చర్చకు వచ్చినప్పటికీ పాత బార్లు మూతపడకపోగా కొత్త బార్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఆంక్షల నుంచి పార్లమెంట్ బార్లకు మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కరోనా ఎఫెక్ట్.. బార్లు బంద్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంపై విరుచుకుపడుతోన్న కరోనా వైరస్(కోవిడ్-19) అరికట్టడానికి అన్ని దేశాలూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందకుండా భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచనలు జారీచేసింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు మూసేశాయి. రద్దీగా ఉండే ప్రాంతలలో జనసమూహం లేకుండా చూసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది. మార్చి 19 నుంచి మద్యం బార్లు మూసివేయనున్నట్లు పుదుచ్చేరి సీఎం వీ నారాయణ స్వామి వెల్లడించారు. పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు బుధవారం నుంచి ఈ నెలాఖరు వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో ఇప్పటివరకు 151 మందికి సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. -
ఇక బార్లలోనూ బ్రీత్ ఎనలైజర్లు..
సాక్షి, చండీగఢ్ : బార్లు, పబ్‌లలో బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసుకోవాలని చండీగఢ్ కేంద్ర పాలితప్రాంత యంత్రాంగం వాటి నిర్వాహకులకు సూచించింది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోగా బ్రీత్ ఎనలైజర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఇటీవల (ఈ నెల 6న) ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి దీనిపై వివరాలు అందించాలని ఆదేశించింది. మందుబాబులు నిర్దేశిత డోస్‌లోనే తాగారా లేదా అని తెలుసుకోవాలని, అదే మితిమీరి తాగితే వారు వాహనం నడపకుండా చూడాలని అధికారులు తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ ఏర్పాటు మంచిదే అయితే, మద్యం వినియోగదారులు ఎంత మొత్తం తాగాలనేది తామెలా నిర్ణయిస్తామని బార్లు, పబ్‌ల యజమానులు అంటున్నారు. మందుబాబులపై తామెలా పోలీసింగ్ చేయగలగమని ప్రశ్నిస్తున్నారు. మితిమీరి తాగిన వారిని ట్యాక్సీతో ఇళ్లకు పంపే ఏర్పాటు చేయగలమని, నిర్దేశించిన వేరకే తాగాలని ఎలా అదుపు చేయగలమని అధికారులను అడిగారు. కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో మద్యం సరఫరా చేసే పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు దాదాపు 100 వరకు ఉన్నట్లు సమాచారం.