
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నప్పటికీ మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. దీంతో పోలీసులు నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై దృష్టి సారిస్తున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్‌లు వేసే కమెడియన్ తన్మయి పట్టుపడ్డాడు. అతనితో పాటు కొంత మంది ఈవెంట ఆర్గనైజర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment