
సాక్షి, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కొన్ని వాహనాలను పోలీస్ శాఖ శనివారం తిరిగి ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను సీజ్ చేయవద్దని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన పలు వాహనాలు పోలీసు శాఖ తీరిగి ఇవ్వటాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించింది. గుర్తింపు పత్రాలను తమ వద్ద పెట్టుకుని సదరు వ్యక్తులకు పోలీసులు వాహనాలను ఇస్తోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టు బడిన వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని, వాహనాలు సీజ్ చేసే సమయంలో మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 448–ఎ నిర్ధేశించిన మేరకు వ్యవహరించాలని హైకోర్టు చెప్పింది. తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించే పోలీస్ అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment