Sudan Student
-
హత్యకు గురైన సూడాన్ దేశస్తుడు
అత్తాపూర్ : నగరంలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి వచ్చిన సూడాన్ దేశస్థుడు హత్యకు గురైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... సూడాన్ దేశానికి చెందిన రాషెస్ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. తమ దేశానికి చెందిన స్నేహితుల దగ్గర ఉంటూ చదువుకుంటన్నాడు. ఇదే క్రమంలో రాషెస్ చెడుఅలావాట్లకు బానిస అయ్యాడు. దీంతో అతని స్నేహితులు వెళ్ళిపొమ్మన్నారు. నాలుగు రోజుల కిందట రాజేంద్రనగర్ బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీలో ఉండే సూడాన్ దేశానికి చెందిన అబ్దుల్లా, లీసా గదికి వచ్చాడు. ఇక్కడ కూడా రాషెస్ చెడు పనులు చేస్తూ గదిలో వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా రాషెస్ లీసా ఉన్న గదికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అబ్దుల్లా, లీసాలు ఆవేశంతో అతడిపై దాడి చేసి పండ్లను కోసే కత్తితో రాషెస్‌ను పొడిచి భయట పడవేశారు. తీవ్ర రక్తస్రావమై రాషెస్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఇద్దరు రాజేంద్రనగర్ పోలీసులకు లొంగిపోయారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
యాక్సిడెంట్ చేశాడని...
నాగోలు : బైక్‌పై కళాశాలకు వెళ్తున్న సూడాన్ విద్యార్థి రోడ్డు దాటుతున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు సూడాన్ విద్యార్థిదే తప్పని అతడిపై దాడి చేసి బైక్‌ను ధ్వంసం చేశారు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సూడాన్‌కు చెందిన హమ్జాద్ సయ్యద్ ఖలీఫ్ స్నేహితుడితో కలిసి మలక్‌పేటలో ఉంటూ దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం తన స్నేహితుడితో కలిసి బైక్‌పై కళాశాలకు బయలుదేరాడు. ఎల్బీనగర్ సవేరా వైన్స్ వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. ఇద్దరు వాహనదారుల మధ్య స్వల్పవివాదం జరిగింది. సూడాన్ దేశస్తుడు మలక్‌పేటలో ఉండే తన స్నేహితులకు ఫోన్ చేశాడు. వారు అక్కడికి చేరుకొనే లోపే స్థానికులు సూడాన్ దేశస్తుడిదే తప్పని, అతడిపై దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా బాధిత సూడాన్ విద్యార్థి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.