
హత్యకు గురైన రాషెస్
అత్తాపూర్ : నగరంలో ఉన్నతవిద్యను అభ్యసించడానికి వచ్చిన సూడాన్ దేశస్థుడు హత్యకు గురైన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరి«ధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... సూడాన్ దేశానికి చెందిన రాషెస్ ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చాడు. తమ దేశానికి చెందిన స్నేహితుల దగ్గర ఉంటూ చదువుకుంటన్నాడు. ఇదే క్రమంలో రాషెస్ చెడుఅలావాట్లకు బానిస అయ్యాడు. దీంతో అతని స్నేహితులు వెళ్ళిపొమ్మన్నారు.
నాలుగు రోజుల కిందట రాజేంద్రనగర్ బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీలో ఉండే సూడాన్ దేశానికి చెందిన అబ్దుల్లా, లీసా గదికి వచ్చాడు. ఇక్కడ కూడా రాషెస్ చెడు పనులు చేస్తూ గదిలో వికృతంగా ప్రవర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి కూడా రాషెస్ లీసా ఉన్న గదికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అబ్దుల్లా, లీసాలు ఆవేశంతో అతడిపై దాడి చేసి పండ్లను కోసే కత్తితో రాషెస్‌ను పొడిచి భయట పడవేశారు. తీవ్ర రక్తస్రావమై రాషెస్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఇద్దరు రాజేంద్రనగర్ పోలీసులకు లొంగిపోయారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.