
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణానికి చెందిన శ్రీని వాస్‌రావు కుమారుడు నాగసాయి రామ్ (21) మీర్‌పేట టీకేఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకం డియర్ చదువుతున్నాడు. అతడు కళాశాల దగ్గరలోనే ఓ హాస్టల్‌లో ఉండేవాడు. గురువారం సాగర్‌రోడ్డులోని అలేఖ్య రెసిడెన్సీ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. శుక్రవారం సిబ్బం ది రూమ్ సర్వీస్ కోసం అతని గది తలుపు తట్టి పిలిచినా స్పందన రాలేదు. దీంతో కిటికీ నుంచి చూస్తే అతడు ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకుని గదిని తెరిచి పరిశీలించారు. మృతుడి వద్ద లభ్యమైన నంబర్ ద్వారా అతడి తండ్రికి సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో నాగసాయి ఓ సైకియాట్రిస్టును కలిసినట్లు పోలీసులు చెప్పారు. అతడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే హాస్ట్టల్ నుంచి బెడ్‌షీట్ తెచ్చుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమూ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment