మాట్లాడుతున్న ప్రభాకర్
నాగోలు: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని తెలంగాణ వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మగాని ప్రభాకర్, టి.వెంకట్రాములు కోరారు. మంగళవారం న్యూ నాగోలు కాలనీలోని ఎస్‌కే డాంగే భవన్‌లో తెలంగాణ రజక వృత్తిదారుల రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల రజకులు సామాజికంగా, ఆర్థికంగా, విద్య, రాజకీయ రంగాలలో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని...
ఫెడరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ప్రతి రజక వృత్తిదారునికి రూ.3 వేల ఫించన్ ఇవ్వాలని, ట్యాంక్‌బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రజక ఫెడరేషన్‌కు పాలకమండలిని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి కన్వీనర్ బొడ్డుపల్లి కృష్ణ, వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పాండురంగాచారి, ఇల్లందుల సాంబయ్య, బాతరాజు నర్సింహ, గుమ్మడి రాజు, సాంబయ్య, భిక్షపతి, ముత్యాలు, రమేష్, రాధ, పెంటయ్య, శ్రీనివాస్, భాగ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.