నాగోలు అరుణోదయ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి భారీ చోరీకి పాల్పడ్డారు.
నాగోలు (హైదరాబాద్) : నాగోలు అరుణోదయ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి భారీ చోరీకి పాల్పడ్డారు. రోడ్డు నెంబర్-2లో నివసించే గద్వాల్ ప్రతాప్ అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున కిటీకీ గ్రిల్స్ తొలగించుకుని దొంగలు లోపలికి ప్రవేశించారు.
ఇంట్లోని 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.10,000లు నగదు తీసుకుని వెనుదిరుగుతుండగా.. ఇంట్లోనివారికి మెలకువ వచ్చింది. దొంగల్ని చూసి కేకలు వేయగా క్షణాల్లో వారు పరారయ్యారు. దీనిపై బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని, జాగిలాలను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.