సాక్షి, నాగోలు: నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో యువతిని వేధిస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన నారాయణ దాస్ మణి ప్రకాశ్(28) కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నాడు. 2020లో ఒక షార్ట్ ఫిల్మ్‌లో యువతి నటించింది. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. షూటింగ్ సమయంలో తీసిన యువతి ఫోటోలను నిందితుడు తన మొబైల్‌లో సేవ్ చేసుకున్నాడు.
తరువాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్ నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఆమె ప్రైవేటు ఫోటోలను అప్‌లోడ్ చేశాడు. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి శుక్రవారం మణి ప్రకాశ్ అరెస్ట్‌చేసి అతని వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి..
తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను..
Comments
Please login to add a commentAdd a comment