సాక్షి, హైదరాబాద్: ఐదు నెలల విరామం తరవాత మెట్రో రైళ్లు నగరంలో సోమ వారం మళ్లీ పరుగుపెట్టాయి. మాస్క్, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటిస్తూ తొలిరోజు నగరవాసులు మెట్రో జర్నీ చేశారు. ఉదయం 7 నుంచి 12 గంటలు, తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. ప్రతి 8 నిమిషాలకో రైలు నడిచింది. ఒక్కో రైలులో తొలిరోజు 300 మంది మాత్రమే ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.
ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డీకాపూల్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్ స్టేషన్లలో సోమవారం రద్దీ అంతగా కనిపించలేదు. ప్రయాణి కులు స్టేషన్లలోకి వెళ్లే ముందే మెట్రో సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేశారు. శానిటైజర్ అందుబాటులో ఉంచారు. స్మార్ట్‌కార్డ్, క్యూఆర్ కోడ్ కూపన్ల ఆధారంగానే ప్రయాణాలు సాగాయి. బోగీల్లో కూర్చునేటప్పుడు, నిల్చునేట ప్పుడు భౌతికదూరం ఉండేలా ప్రయాణి కులు జాగ్రత్తపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల వరకు ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో 120 ట్రిప్పులు తిరగగా, 19 వేల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
నేడు నాగోల్–రాయదుర్గం రూట్లో..
మంగళవారం నాగోల్–రాయదుర్గం మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటా యి. బుధవారం నుంచి జేబీఎస్–ఎంజీబీఎస్ రూటు సహా 3 మార్గాల్లోనూ మెట్రో రైలు సర్వీసులు అందు బాటులోకి వస్తాయి. ఈ నెలాఖరుకు ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయ దుర్గం మార్గాల్లో రోజూ 2 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని మెట్రో వర్గాల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment