
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైల్‌కు విపరీత స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలులో మొదటి రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందులో సరదాగా ప్రయాణించాలనుకున్న వారు ఇరవై శాతం వరకు ఉంటారని ఎన్వీఎస్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు క్రమశిక్షణ గలవారని మరోసారి నిరూపించుకున్నారని కితాబునిచ్చారు. ట్రైన్ ఎక్కేప్పుడు దిగేప్పుడు హడావుడి పడవద్దని ప్రయాణికులను కోరారు. ట్రైన్ లో వృద్దులకు, మహిళలకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంకా కొన్ని సాంకేతిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. మియాపూర్ నుంచి అమీర్‌పేటకు మొదటిరోజు ఎనిమిది నిమిషాలకు ఒక రైలు, అలాగే అమీర్‌పేట నుంచి నాగోల్ వరకూ 15 నిమిషాలకు ఒకసారి రైళ్లు నడుస్తాయన్నారు.
- భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు
- మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ కంపల్సరీ కాదు
- హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రత తో మెట్రో ప్రయాణాలు చేయవచ్చు
- త్వరలో మెట్రో పాసులను కూడా అందుబాటులోకి తెస్తాం
- పార్కింగ్ పనులు పూర్తి అవడానికి నెల సమయం పడుతుంది
- ఇంకా పార్కింగ్ ధరలు నిర్ణయించలేదు
- సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద గవర్నమెంటు ఆఫ్ ఇండియా టికెట్ ధరలను నిర్ణయింస్తుంది
- 2018 జూన్ వరకి 66 కిమీల మూడు కిమీల కారిడార్ పూర్తి చేస్తాం
- మూడు కారిడార్లు 2018 జూన్ వరకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం
Comments
Please login to add a commentAdd a comment