MIYAPUR metro station
-
మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న (శుక్రవారం) సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్ సంచరించింది చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు? -
ఆమె కోసం మెట్రో పరుగు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ... రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా... రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు తీసింది. సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది. రాత్రిపూట ఒంటరిగా స్టేషన్‌కు... ఈ నెల 14న రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్–మియాపూర్ మార్గంలోని విక్టోరియా మెమోరియల్ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని అధికారులను వేడుకుంది. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు. ఎల్బీ నగర్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్‌కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. శుక్రవారం మెట్రోరైలు భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. -
నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు!
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైల్‌కు విపరీత స్పందన వచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలులో మొదటి రోజు లక్ష మంది ప్రయాణించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందులో సరదాగా ప్రయాణించాలనుకున్న వారు ఇరవై శాతం వరకు ఉంటారని ఎన్వీఎస్ అన్నారు. హైదరాబాద్ ప్రజలు క్రమశిక్షణ గలవారని మరోసారి నిరూపించుకున్నారని కితాబునిచ్చారు. ట్రైన్ ఎక్కేప్పుడు దిగేప్పుడు హడావుడి పడవద్దని ప్రయాణికులను కోరారు. ట్రైన్ లో వృద్దులకు, మహిళలకు చోటు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరారు. ఇంకా కొన్ని సాంకేతిక పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. మియాపూర్ నుంచి అమీర్‌పేటకు మొదటిరోజు ఎనిమిది నిమిషాలకు ఒక రైలు, అలాగే అమీర్‌పేట నుంచి నాగోల్ వరకూ 15 నిమిషాలకు ఒకసారి రైళ్లు నడుస్తాయన్నారు. భవిష్యత్తులో నాగోల్ నుంచి మియాపూర్ వరకూ ఒకే రైలు మధ్యలో అమీర్ పేట్ ఇంటర్ ఛేంజ్ పాయింట్ కంపల్సరీ కాదు హైదరాబాదు ప్రజలు పూర్తి భద్రత తో మెట్రో ప్రయాణాలు చేయవచ్చు త్వరలో మెట్రో పాసులను కూడా అందుబాటులోకి తెస్తాం పార్కింగ్ పనులు పూర్తి అవడానికి నెల సమయం పడుతుంది ఇంకా పార్కింగ్ ధరలు నిర్ణయించలేదు సెంట్రల్ మెట్రో యాక్ట్ కింద గవర్నమెంటు ఆఫ్ ఇండియా టికెట్ ధరలను నిర్ణయింస్తుంది 2018 జూన్ వరకి 66 కిమీల మూడు కిమీల కారిడార్ పూర్తి చేస్తాం మూడు కారిడార్లు 2018 జూన్ వరకి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం -
ఆ మూడు మెట్రో స్టేషన్లలో కిటకిట..
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెట్రో రైలు కూత పెట్టింది. దీంతో ఎన్నాళ్ల నుంచో ఊరించిన మెట్రో రైలు ఎక్కేందుకు నగరవాసులు ఉత్సాహం చూపించారు. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్లో, మరో రైలు మియాపూర్ స్టేషన్లో బయల్దేరాయి. తెల్లవారుజామే అయినప్పటికీ మియాపూర్, అమీర్‌పేట, నాగోల్ మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కళకళలాడాయి. మెట్రో రైలులో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. మెట్రో రైలులో ప్రయాణిస్తున్న వారి ముఖంలో సంతోషం, ఇక నుంచి ప్రయాణం సాఫీగా సాగుతుందన్న భరోసా కనిపించింది. కుదుపుల్లేని, ఏసీ ప్రయాణాన్ని ప్రయాణికులు ఆస్వాదించారు. ఇక తొలి టికెట్ కొన్న ప్రయాణీకుడికి మెట్రో అధికారులు గిఫ్ట్ అందజేశారు. ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరగనున్నాయి. మెట్రో రాకతో నాగోలు నుంచి అమీర్‌పేట ప్రయాణ సమయం 42 నిమిషాలకు తగ్గిపోయింది. మెట్రో రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి పది గంటల వరకు నడవనున్నాయి. ప్రతీ 15 నిమిషాలకో రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. రైల్లో ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు. మరోవైపు తొలిసారి మెట్రో ఎక్కిన హైదరాబాదీలు...ఫొటోలు, సెల్ఫీలు, వాట్సాప్, ఫేస్బుక్ అద్యంతం సంతోషాల షేరింగే కనిపించింది. ఫస్ట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అంటూ ఒకరంటే, గాల్లో తేలినట్టుందే అని మరొకరు కవితాత్మకంగా పోస్టింగ్‌లు పెట్టారు. ఆనందం, సంతోషం ఎలా ఉన్నా.. టికెట్ ధరలు మాత్రం కొందరిని ఆందోళనకు గురి చేశాయి. ఆర్టీసీ బస్సుల ధర కంటే ఎక్కువున్నాయని కొందరంటే, సమయానికి చేరుకుంటాంలే అని మరికొందరు అన్నారు. ఇక పార్కింగ్ విషయంలో ఇంకాస్తా క్లారిటీ రావాలంటున్నారు మరికొందరు. స్టేషన్ల పరిధిలో స్మార్ట్ బైకులు అందుబాటులో ఉన్నా.. తమ సొంత వాహానాల పార్కింగ్ ఎక్కడంటూ ప్రశ్నిస్తున్నారు. -
ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత..
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం మెడలో మెట్రో మణిహారం అందంగా కొలువుతీరింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో ప్రారంభమైంది. ప్రధాని ప్రయాణించిన మెట్రోకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ మెట్రో రైలును ఓ మహిళా పైలట్ నడపడం విశేషం. ప్రధాని ప్రయాణించిన ఈ మెట్రోను లోకో పైలట్ సుప్రియ నడిపారు. మియాపూర్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో భాగ్యనగరి మెట్రో రైలు సర్వీసులను ప్రధాని మోదీ ఆరంభించిన విషయం తెలిసిందే. మొదట మెట్రో పైలాన్ ఆవిష్కరించిన ఆయన తర్వాత మియా పూర్ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మన హైదరాబాద్-మన మెట్రోపై తయారు చేసిన ప్రత్యేక వీడియోను తిలకించారు. ఆ తర్వాత మెట్రో బ్రోచర్తో పాటు మెట్రో యాప్‌ను విడుదల చేశారు. మియాపూర్‌లో స్వల్ప లాఠీఛార్జ్ మరోవైపు మెట్రో రైలు ప్రారంభం సందర్భంగా ఆ వేడుకను తిలకించేందుకు వచ్చిన స్థానికులను పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో మియాపూర్‌లో ఓ దశలో స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక మెట్రో స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని హెచ్ఐసీసీకి బయల్దేరి వెళ్లారు. అనంతరం ఒక్కసారిగా ట్రాఫిక్ వదలటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెట్రో రైలును ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ
-
హైదరాబాద్ మెట్రో పట్టాలెక్కిందోచ్...
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. మియాపూర్-అమీరీ్‌పేట-నాగోల్ మధ్య మెట్రో సర్వీసులకు ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకూ మెట్రో రైలులో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్, పలువురు మంత్రులు ప్రయాణించారు. అలాగే అదే రైలులో మరలా మియాపూర్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణంలో ప్రధాని వెంట గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, కేటీఆర్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ నేత కిషన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు. మియాపూర్ నుంచి కూకట్పల్లి వరకు దాదాపు పది నిమిషాల పాటు ఆహ్లాదకర వాతావరణంలో సాగిన ఈ మెట్రో రైడ్‌లో మెట్రో ప్రాజెక్టు విశేషాలను మోదీకి మంత్రి కేటీఆర్ వివరించారు. మెట్రో రైడ్ ఆద్యంతం మోదీ, కేటీఆర్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతకు ముందు ప్రధాని మియాపూర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్రో లైన్ పైలాన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ఆ తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించి, మెట్రో రైలు ప్రాజెక్ట్ వీడియో ప్రదర్శనను తిలకించారు. అలాగే మెట్రో రైల్ బ్రోచర్తో పాటు యాప్‌ను విడుదల చేశారు. ముందుగా ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొద్దిసేపు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో మియాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. ఆయన వెంట బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఉన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ మెట్రో సూపర్ డూపర్ ఖాయం..
సాక్షి, హైదరాబాద్ : మెట్రో రైలు విషయంలో చిల్లర రాజకీయాలు చేయదలచుకోలేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ... మెట్రో ప్రాజెక్ట్‌లో క్రెడిట్, డెబిట్ల గురించి తాము ఆలోచించడం లేదన్నారు. మెట్రో ప్రారంభోత్స పనులను కేటీఆర్ మంగళవారం సమీక్షించారు. మియాపూర్‌లో ఆయన అధికారులతో కలిసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌లో మెట్రో సూపర్ డూపర్ కావడం ఖాయమన్నారు. మెట్రో రైలుతో నగరవాసుల ప్రజా రవాణా వ్యవస్థ సులభతరంగా మారుతుందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని అన్నారు. మెట్రో వల్ల కొత్త తరహా ఆర్థిక కార్యకలాపాలు మొదలవుతాయని, మెట్రో రైలు ఓ కీలకమైన ప్రజా రవాణా ప్రాజెక్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం 2:15 గంటలకు మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైలులో కూకట్పల్లి వరకు అయిదు కిలోమీటర్ల మేర ప్రయాణించనున్నారు. తిరిగి కూకట్పల్లి నుంచి మళ్లీ మియాపూర్‌కు ప్రయాణిస్తారు. -
వసంత్‌నగర్‌లో మెడోల్యాండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల జీవనశైలిలో సరికొత్త మార్పులొస్తున్నాయి. అందుబాటు ధరల్లో.. ఆధునిక వసతులుండాలని కోరుకుంటున్నారు. అందుకే అభివృద్ధి చెందిన ప్రాంతంలో తక్కువ ధరల్లో లగ్జరీ సదుపాయాలు కల్పించే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామంటున్నారు ఏక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్ ప్రై.లి. ఎండీ రామకృష్ణ (ఆర్కే). ⇒ కూకట్పల్లి వసంత్‌నగర్‌లో 4.5 ఎకరాల్లో మెడోల్యాండ్ పేరుతో తొలి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఈ హైఎండ్ ప్రాజెక్ట్‌లో మొత్తం 330 ఫ్లాట్లుంటాయి. ⇒ 1,185-1,225 చ.అ. మధ్య 2 బీహెచ్‌కే, 1,435-1,950 చ.అ. 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణాలుంటాయి. 2 బీహెచ్‌కే ధర రూ.45 లక్షలు, 3 బీహెచ్‌కే ధర రూ.56 లక్షలుగా నిర్ణయించాం. ఏప్రిల్ 2016 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ⇒ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఆరు నెలల వ్యవధిలోనే 30 శాతానికి పైగా అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్‌లోని వసతులు, ప్రాంతం అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం ప్రత్యేకతలు చూస్తే.. జేఎన్టీయూ 1.5 కి.మీ. సైబర్ టవర్స్‌కు 5 కి.మీ. దూరంలో, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం కి.మీ. దూరంలో, మలేషియా టౌన్షిప్ సర్కిల్ నుంచి 1.2 కి.మీ. దూరంలోనే ఉంది. ⇒ కేవలం 37 శాతం స్థలంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం ఉంటుంది. మిగతాదంతా ఓపెన్ ప్లేసే. దీంతో ప్రాజెక్ట్‌లోకి గాలి, వెలుతురు బాగా వస్తుంది. 16 వేల చ.అ. క్లబ్ హౌజ్, ఏసీ జిమ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, మెడిటేషన్ సెంటర్, జాగింగ్ ట్రాక్, వై-ఫై, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వంటి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.