
వసంత్‌నగర్‌లో మెడోల్యాండ్!
సాక్షి, హైదరాబాద్: నగరవాసుల జీవనశైలిలో సరికొత్త మార్పులొస్తున్నాయి. అందుబాటు ధరల్లో.. ఆధునిక వసతులుండాలని కోరుకుంటున్నారు. అందుకే అభివృద్ధి చెందిన ప్రాంతంలో తక్కువ ధరల్లో లగ్జరీ సదుపాయాలు కల్పించే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామంటున్నారు ఏక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్ ప్రై.లి. ఎండీ రామకృష్ణ (ఆర్కే).
⇒ కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో 4.5 ఎకరాల్లో మెడోల్యాండ్ పేరుతో తొలి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఈ హైఎండ్ ప్రాజెక్ట్‌లో మొత్తం 330 ఫ్లాట్లుంటాయి.
⇒ 1,185-1,225 చ.అ. మధ్య 2 బీహెచ్‌కే, 1,435-1,950 చ.అ. 3 బీహెచ్‌కే ఫ్లాట్ విస్తీర్ణాలుంటాయి. 2 బీహెచ్‌కే ధర రూ.45 లక్షలు, 3 బీహెచ్‌కే ధర రూ.56 లక్షలుగా నిర్ణయించాం. ఏప్రిల్ 2016 నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
⇒ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ఆరు నెలల వ్యవధిలోనే 30 శాతానికి పైగా అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్‌లోని వసతులు, ప్రాంతం అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం ప్రత్యేకతలు చూస్తే.. జేఎన్‌టీయూ 1.5 కి.మీ. సైబర్ టవర్స్‌కు 5 కి.మీ. దూరంలో, మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం కి.మీ. దూరంలో, మలేషియా టౌన్‌షిప్ సర్కిల్ నుంచి 1.2 కి.మీ. దూరంలోనే ఉంది.
⇒ కేవలం 37 శాతం స్థలంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం ఉంటుంది. మిగతాదంతా ఓపెన్ ప్లేసే. దీంతో ప్రాజెక్ట్‌లోకి గాలి, వెలుతురు బాగా వస్తుంది. 16 వేల చ.అ. క్లబ్ హౌజ్, ఏసీ జిమ్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, మెడిటేషన్ సెంటర్, జాగింగ్ ట్రాక్, వై-ఫై, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వంటి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.