ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ వివాహాలు చేసుకుంటున్న ఓ యువకున్ని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్నకారుడ్రైవర్ రిమాండ్
నాగోలు: ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ వివాహాలు చేసుకుంటున్న ఓ యువకున్ని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.... నాగోలు సాయినగర్‌కు చెందిన మహేష్ (25) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతంలో ఇతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2015లో భార్యకు తెలియకుండా ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహేష్‌ను రిమాండ్‌కు తరలించారు.
జైలుకు వెళ్లి వచ్చినా అతను తన బుద్ధిని మార్చుకోకుండా గత నెలలో ఎన్ టీఆర్‌నగర్‌కు చెందిన యువతిని యాదగిరిగుట్టలో మరో వివాహం చేసుకున్నాడు. అతడికి రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుసుకున్న సదరు యువతి ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.