విద్యార్థినిని వేధించిన సమీర్
నాగోలు: ప్రేమను నిరాకరించడంతో ఆమెపై కోపం పెంచుకుని.. నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి కాల్ గర్ల్‌గా నెట్‌లో ఉంచి వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్ తరలించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన మేరకు.. కింగ్ కోఠిలో నివాసముండే సమీర్ ఇబ్రహీపట్నం దగ్గరలోని ఎంఆర్‌ఎం కళాశాలలో ఎంబీఎ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన క్లాస్‌మేట్ అయిన విద్యార్ధినితో పరిచయమైంది. ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. రోజూ చాటింగ్‌చేసేవారు. ఈ క్రమంలో సమీర్ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పడంతో నిరాకరించింది.
ఆ తరువాత మాట్లాడటం మానేసింది. ఆమెపై కోపం పెంచుకున్న సమీర్.. తన స్మోర్ట్ ఫోన్ ద్వారా లోకాంటో డేటింగ్ వెబ్‌సైట్‌లో నకలీ జిమెయిల్ అకౌంట్ సృష్టించాడు. ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అశ్లీల ఫొటోకు ఆమె పేరు, ఫోన్ నంబర్లను జోడించి కాల్ గర్ల్‌గా చూపించి ఇంటర్ నెట్లో పెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం మొహద్ సమీర్‌ను కింగ్ కోఠీలో అరెస్టు చేసి అతని వద్ద స్మార్ట్‌ఫోన్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు.(చదవండి: ప్రసాద్ మరణం.. అన్నీ అనుమానాలే... )
చాయ్ డబ్బు అడిగినందుకు గుడిసెను తగులబెట్టాడు
నాగోలు: చాయ్ తాగిన అనంతరం డబ్బు అడిగినందుకు.. అర్ధరాత్రి సమయంలో చాయ్ గుడెసెను పెట్రోల్ పోసి తగలబెట్టాడో వ్యక్తి. ఎల్‌బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్టీఆర్‌నగర్‌లో నివాసముండే పందిరి గండమ్మ ఎన్టీఆర్‌నగర్‌లో చింతచెట్లు దగ్గర చిన్న గుడిసె వేసుకుని చాయ్ విక్రయాలు సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన షబ్బీర్(40) స్థానికంగా బైక్ మెకానిక్ పనిచేస్తుంటాడు. తరుచుగా షబ్బీర్ గండమ్మ దగ్గర చాయ్ తాగుతూ డబ్బులు తరువాత ఇచ్చేవాడు. బాకీ పెరిగిపోవడంతో షబ్బీర్‌ను నిలదీసింది. ఇది మనసులో పెట్టుకున్న షబ్బీర్ గతనెల 25న అర్ధరాత్రి 2 గంటల సమయంలో మద్యం మత్తులో చాయ్ గుడిసెపై పెట్రోల్ పోసి తగలబెట్టి పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి సీసీకెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment