నాగోలులో విషాదం | Two toddlers dies after fall in fountain | Sakshi
Sakshi News home page

నాగోలులో విషాదం

Published Thu, Oct 5 2017 6:17 AM | Last Updated on Thu, Oct 5 2017 8:39 AM

Two toddlers dies after fall in fountain

హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోలులోని శుభం కన్వెన్షన్ హాల్లో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి కన్వెన్షన్ హాల్లో ఓ ఫంక్షన్‌ జరుగుతున్న సమయంలో హాల్ బయట ఆడుకుంటూ నీటి సంపులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మనశ్రీ, జితేందర్‌లు గుర్తించారు. తల్లిదండ్రులతో కలిసి ఫంక్షన్‌కు హాజరైన చిన్నారులు ఆడుకోవడానికి సంపు దగ్గరకు వెళ్లి అందులో పడిపోయారు. గమనించిన సెక్యురిటీ సిబ్బంది వెంటనే దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చిన్నారులు మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎల్‌బీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement