
బాలికలపై అఘాయిత్యం
- వెలుగులోకి వచ్చిన మూడు ఘటనలు
- 8 ఏళ్ల బాలికపై బాలుడి లైంగికదాడి
- మైనర్‌ను గర్భవతిని చేసిన యువకుడు
- మరో బాలికను లోబర్చుకున్న మేనబావ
నాగోలు/గోల్నాక/అల్వాల్: నగరంలో ఒకే రోజు మూడు దారుణాలు వెలుగులోకి వచ్చాయి. నాగోలు పరిధిలో ఆడుకునేందుకు వచ్చిన బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగికదాడికి పాల్పడ్డాడు. గోల్నాక ప్రాంతంలో మరో బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబ ర్చుకోగా... అల్వాల్‌లో బాలికపై మేనబావ లైంగికదాడికి పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి కోసం నగరానికి వచ్చింది. కుటుంబ పెద్ద నాగోలు కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఇతని కూతురు (8) నిజామాబాద్ జిల్లాలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. వేసవి సెలవులు కావడంతో కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇదిలా ఉండగా... అదే కాలనీలో ఉండే ఆర్టీసీ కండక్టర్ కుమారుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు శుక్రవారం సాయంత్రం సదరు బాలికను ఆడుకుందామని బిల్డింగ్‌పైకి తీసుకెళ్లి లైంగికదాడికి పా ల్పడ్డాడు. ఏడుస్తూ కిందకు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఆదివారం రాత్రి బాధితురాలి తల్లి ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు న మోదు చేసిన పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకు ని కోర్టు ఆదేశాల మేరకు జువైనల్‌హోంకు తరలించారు.
బాలికను గర్భవతిని చేసిన యువకుడు...
గోల్నాక: మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన ఓ యువకుడిపై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రెడ్డి కథనం మేరకు...బాగ్‌అంబర్‌పేట మల్లన్నగుడి ప్రాంతానికి చెందిన లింగయ్యగౌడ్ కుమారుడు ఉమేష్‌గౌడ్(19) డ్రైవర్. అంబర్‌పేట బుర్జుగల్లీలో నివాసముంటున్న 14 బాలికతో అతనికి పరిచయం ఏర్పడింది. మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఉమేష్‌గౌడ్ బాలికను గర్భవతిని చేశాడు. బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మేనబావ దారుణం...
అల్వాల్ : బాలికపై మేనబావ లైంగికదాడికి పాల్పడ్డాడు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం..... సికింద్రాబాద్ బోయిగూడలో నివాసముండే బాలిక (17)కు అల్వాల్ సూర్యానగర్‌లో ఉండే మేనబావ మేరియన్ ఇమ్మాన్యుయేల్ (25) మాయమాటలు చెప్పి కొంతకాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. బాలిక గర్భం దాల్చడం విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇమ్మాన్యుయేల్‌ను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
సినిమాల ప్రభావంతోనే: అనురాధారావు
సినిమాలు,ఇంటర్నెట్ ప్రభావంతోనే పిల్లలు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనురాధరావు అన్నారు. పాఠశాలల్లో శాస్త్రీయమైన విద్య అందించకపోవడం తో సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. పిల్లల్లో ఇలాంటి దుష్ఫరిణామాలు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
లైంగికదాడి కేసులో మారుతండ్రి రిమాండ్
జీడిమెట్ల: బాలికపై లైంగికదాడికి పాల్పడిన మారుతండ్రిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. బోరబండకు చెందిన గౌసొద్దీన్ (50) గాంధీనగర్‌కు చెందిన సాహెద బేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. సాహెద బేగంకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. సాహెద అస్వస్థతకు గురికావడంతో బాలికపై కన్నేసిన గౌసొద్దీన్ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భందాల్చిన బాలికను మెదక్‌జిల్లాలోని బాలికల సంరక్షణ కేంద్రంలో చేర్పించాడు. అసలు విషయం గుర్తించిన సంరక్షణ కేంద్రం నిర్వాహకులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం గౌసొద్దీన్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.