టీటీసీ పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయింది. ఈ ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నాగోలు (హైదరాబాద్) : టీటీసీ పరీక్ష రాయడానికి వెళ్లిన ఓ విద్యార్థిని కనిపించకుండాపోయింది. ఈ ఘటన ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ రాగన్నపురం కాలనీకి చెందిన కె.లిఖిత(20) ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లి భారత్ కళాశాలలో టీటీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ నెల 1వ తేదీన ఎల్‌బీ నగర్ ప్రభుత్వ పాఠశాల కేంద్రంలో నిర్వహించిన పరీక్షకు హాజరైంది. అనంతరం ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు. దీంతో తెలిసినవారిళ్లలో కుటుంబసభ్యులు వాకబు చేశారు. జాడ తెలియకపోవటంతో తండ్రి ఆంజనేయులు శుక్రవారం రాత్రి ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.