
హైదరాబాద్ : బిర్యానీ ఇవ్వలేదని నాగోల్ లోని లక్కీ హోటల్ పై బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. బిర్యానీ ఇవ్వలేదనే కోపంతో హోటల్ యజమానిపై దాడి చేసి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. నాగోల్ కార్పొరేటర్ అనుచరులమంటూ దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. హోటల్ యజమానికి తీవ్రగాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో 10మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment