ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాదిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు
నాగోలు: ప్రేమించమని వేధింపులకు పాల్పడుతున్న న్యాయవాదిని ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం దిల్çసుఖ్‌నగర్‌కు చెందిన ఓ యువతి(23) రంగారెడ్డి జిల్లా కోర్డులో ఉద్యోగి. కూకట్‌పల్లి కోర్టులో పనిచేస్తున్న సమయంలో గచ్చిబౌలి పీజే కాలనీకి చెంది న అడ్వకేట్ ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన ప్రవీణ్‌కుమార్ తనను ప్రేమిం చాలంటూ ఏడాదిగా వేధిస్తున్నాడు. వేధింపులకు తాళ లేక ఆమె రంగారెడ్డి జిల్లా కోర్టుకు బదిలీ చేయించుకుం ది. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో సోమవా రం బాధితురాలు ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.