సినిమాకు వెళ్లొచ్చేలోగా.. | family went to movie and robbery in their home | Sakshi
Sakshi News home page

సినిమాకు వెళ్లొచ్చేలోగా..

Published Tue, Jun 20 2017 8:55 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

family went to movie and robbery in their home

నాగోలు: సినిమాకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు, నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగోలు డివిజన్‌ సాయిరాంనగర్‌ కాలనీకి చెందిన ముత్యంకుమార్‌ ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సెకండ్‌ షో సినిమాకు వెళ్లారు.

తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నట్లు గమనించారు. బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, వెండి సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమాని గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement