
కొడుకు పాత్రధారితో రొమాన్స్!
ముంబై :'బాలిక వధు' ధారావాహికంతో వీక్షకులకు బాగా పరిచయమైన నటి వీభా ఆనంద్. అనంతరం 'మహా భారత్' టెలీ సీరియల్ లో అర్జునికి భార్యగా నటించి ప్రేక్షకులు మన్ననలను అందుకుంది. ఇప్పుడు తాజాగా ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది. అది కూడా శృంగార పరమైన ఆల్బమ్. అందుకు పరాస్ అరోరాను ఆమెకు జోడీగా ఎన్నుకున్నారు. అంతకుముందు 'మహా భారత్' లో అరోరాకు తల్లిగా నటించిన వీభా.. ఇప్పుడు అదే నటుడితో రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది.
ఆ ఆల్బమ్ లో పరాస్ అరోరా-వీభాలపై రొమాంటిక్ సన్నివేశాలను రూపొందించారు. ఈ మధ్యే షిలాంగ్ లో చిత్రీకరణ జరుపుకున్న మ్యూజిక్ ఆల్బమ్ కు సంబంధించి ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగా పండినట్లు తెలుస్తోంది.