టీనేజ్‌లో న్యూయార్క్‌కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్‌గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్‌తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది.
‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా.
(చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను)
Comments
Please login to add a commentAdd a comment