
నాయిక ఆయుష్ తక్కువే
సినిమాల్లో నాయికల ఆయుష్ చాలా తక్కువ అని అంటున్నారు శ్రుతిహాసన్. చిన్న వయసులోనే సంగీతం, సాహిత్యంలో ప్రజ్ఞ కలిగిన శ్రుతిహాసన్. తొలుత సంగీత రంగంపైనే దృష్టి సారించిన ఈ బ్యూటీ తన తండ్రి నటించిన ఉన్నై ప్పోల్ ఒరువన్ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. అంతకుముందు ఆ తరువాత కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా తయారు చేసిన శ్రుతి అనూహ్యంగా హిందీ చిత్రం లక్ ద్వారా నాయకిగా తెరపైకి వచ్చారు. ఆ తరువాత వరుసగా తెలుగు, తమిళం భాషల్లో పరిచయమైన ప్రస్తుతం ప్రముఖ నాయకిగా ప్రకాశిస్తున్నారు.
అయితే సంగీతమే ప్రాణంగా పేర్కొ నే శ్రుతి అటు వైపు దృష్టి సారించకపోవడం గురించి వివరి స్తూ సినిమాల్లో నాయకి ఆయుష్ చాలా తక్కువని, మం చి మార్కెట్ ఉండేది కొంచెం కాలమేనన్నారు. కథానాయకుల పరిస్థితి వేరన్నారు. వాళ్లు చాలా కాలం కథా నాయకులుగా నటించగలుగుతారని, నాయికలకు అలాంటి అవకాశమే లేదన్నారు. ఇకపోతే సంగీతానికి, సాహిత్యానికి వయసుతో పని లేదన్నారు. వృద్ధాప్యం వచ్చినా కాలు కదప కుండా ఒక చోట కూర్చొని రచనలు చేసుకోవచచని అన్నారు. తనకు సంగీతం, సాహిత్యంపై ఆసక్తి ఉ న్నా ప్రస్తుతానికి నటనపై దృష్టి సారించడానికి ప్రధా న కారణం ఇదేనని స్పష్టం చేశారు.
ఇక్కడ కూడా గట్టి పోటీ నెలకొందన్నారు. అంతేకాకుండా నాయకిగా తాము రాణిస్తున్న వెనుక తమ ప్రతిభ ఒక్కటే కారణం కాదని శ్రుతి అన్నారు. కేశాలంకరణ, మేకప్ కళాకారులు తమ అందాలకు మెరుగులు దిద్దుతుంటే దాన్ని దర్శకుడి భావాలకనుగుణంగా ఛాయాగ్రాహకులు మరింత అందంగా తెరపై చూపిస్తుం టారని తెలిపారు. తెరపై చూసిన ప్రేక్షకులు నాయకి చాలా అందంగా ఉందని చెప్పుకుంటారని అన్నారు. అయితే సాహితీ, సంగీత కళాకారులకు పెన్ను, పేపరు, కాస్త మెదడు ఉంటే చాలని, 50ఏళ్ల తరువాత కూడా ఈ రంగాల్లో రాణించవచ్చని శ్రుతి అంటున్నారు.