ప్రాశ్చాత్య దేశాల్లో పాప్ సింగర్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. సింగర్స్ అంటే పిచ్చి అభిమానంతో ఊగిపోతుంటారు. కొందరు సెలబ్రిటీలు ఆ పాపులారిటీని మంచికి వాడుకుంటుంటే, కొందరు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. అనంతరం నేరం రుజువై కటాకటా పాలవుతుంటారు. అమెరికా పాప్ సింగర్ రాబర్ట్ సిల్వస్టర్ కెల్లీ (ఆర్ కెల్లీ) విషయంలో అలాగే జరిగింది.
‘ఐ బిలీవ్ ఐ కెన్ ఫ్లై’ పాటతో పాపులర్ అయిన ఆర్.కెల్లీపై 2019లో లైగింక వేధింపుల కేసులు నమోదైయ్యాయి. అప్పటి నుంచి అతను కస్టడీలోనే ఉన్నాడు. అయితే సుదీర్ఘకాలంగా జరిగిన విచారణ తర్వాత సోమవారం (సెప్టెంబర్ 27న) మొత్తం తొమ్మిది అభియోగాల్లో దోషిగా తేల్చింది. తన పాపులారిటీని ఉపయోగించుకుని మహిళలు, బాలికలని వంచించనట్లు కోర్టు తెలిపింది. కెల్లీ తనను బంధించి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశాడని ఓ మహిళ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో అతని బండారం మొత్తం బయట పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అతను మైనర్ బాలికలు, బాలురను సైతం లైగికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ కేసులో తుది తీర్పును కోర్టు వచ్చే ఏడాది మే నెలలో వెలువరించనున్నది.
Comments
Please login to add a commentAdd a comment