'ఆ ఆల్బమ్కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే' | My heartbreak inspired my album: Rita Ora | Sakshi
Sakshi News home page

'ఆ ఆల్బమ్కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'

Published Sun, Mar 6 2016 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

'ఆ ఆల్బమ్కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'

'ఆ ఆల్బమ్కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'

లాస్ఏంజిల్స్: బ్రిటన్ పాప్ సింగర్ రీటా ఓరా తన రాబోయే ఆల్బమ్కు ప్రేరణ తన లవ్ ఫెయిల్యూరే అని చెబుతోంది. ఒకప్పుడు స్కాంట్లాండ్ డీజే కాల్విన్ హారిస్తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు అతనికి బైబై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే హారిస్తో బ్రేకప్.. తన రాబోయే ఆల్బమ్లో రెండు పాటలకు ప్రేరణనిచ్చిందని ఓరా వెల్లడించింది. హ్యారిస్తో బ్రేకప్ అనంతరం ప్రముఖ డిజైనర్ టామి హిల్ఫింగర్ కుమారుడు రిక్కితో డేటింగ్ చేసిన ఓరాకు ఆ రిలేషన్ కూడా కలిసిరాకపోవడంతో 2015 చివర్లో అతనితోనూ  విడిపోయింది.

'హ్యారిస్తో బ్రేకప్ తరువాత చాలా కోపానికి, ఉద్వేగానికి గురయ్యాను. అతనంటే అసహ్యం కలిగింది. ఆ తరువాత మాత్రం నన్ను నీను నియంత్రించుకున్నాను. రాబోయే ఆల్బమ్లో ఈ హార్ట్ బ్రేకప్ గురించి రెండు పాటలుంటాయి' అని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రీటా ఓరా తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement