rita ora
-
'ఆ ఆల్బమ్‌కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'
లాస్ఏంజిల్స్: బ్రిటన్ పాప్ సింగర్ రీటా ఓరా తన రాబోయే ఆల్బమ్‌కు ప్రేరణ తన లవ్ ఫెయిల్యూరే అని చెబుతోంది. ఒకప్పుడు స్కాంట్లాండ్ డీజే కాల్విన్ హారిస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు అతనికి బైబై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే హారిస్‌తో బ్రేకప్.. తన రాబోయే ఆల్బమ్‌లో రెండు పాటలకు ప్రేరణనిచ్చిందని ఓరా వెల్లడించింది. హ్యారిస్‌తో బ్రేకప్ అనంతరం ప్రముఖ డిజైనర్ టామి హిల్ఫింగర్ కుమారుడు రిక్కితో డేటింగ్ చేసిన ఓరాకు ఆ రిలేషన్ కూడా కలిసిరాకపోవడంతో 2015 చివర్లో అతనితోనూ విడిపోయింది. 'హ్యారిస్‌తో బ్రేకప్ తరువాత చాలా కోపానికి, ఉద్వేగానికి గురయ్యాను. అతనంటే అసహ్యం కలిగింది. ఆ తరువాత మాత్రం నన్ను నీను నియంత్రించుకున్నాను. రాబోయే ఆల్బమ్‌లో ఈ హార్ట్ బ్రేకప్ గురించి రెండు పాటలుంటాయి' అని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రీటా ఓరా తెలిపింది. -
'నా డ్రెస్సింగ్‌తో సంతృప్తిగానే ఉన్నా'
లండన్: బ్రిటన్ సింగర్, నటి రీటా ఓరా డ్రెస్సింగ్ ఎప్పుడూ సంచలనమే. డ్రెస్సింగ్ విషయంలో ఆమెకు ఆమే సాటి. రీటా వాడే డిజైన్లు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తూ అభిమానులను చూపు తీప్పుకోకుండా చేస్తాయి. అయితే కొన్నిసార్లు రీటా అనుకోకుండానే అభిమానులకు తన అందాలతో కనువిందు చేస్తుంటారు. అదెలాగంటే చాలా కార్యక్రమాల్లో ఆమె ధరించిన వస్త్రాలు.. యాక్సిడెంటల్‌గా ఊడిపోయి ఆమెకు హ్యాండ్ ఇచ్చాయి. రీటా డ్రెస్సింగ్ చాలా రిస్క్‌తో కూడుకున్నదని డిజైనర్లు చెబుతుంటారు. దీనిపై రీటా మాట్లాడుతూ ' ఇది చాలా సరదాగా ఉంటుంది. నేను ధరించే వస్త్రాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అనుకోకుండా చాలాసార్లు అలా జరిగినంత మాత్రాన నేను ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నలుగురిలో నేను చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. ఫ్యాషన్‌లో రిస్క్ తీసుకోవడం అవసరం కూడా' అని చెబుతోంది. పైగా అలా రిస్క్ తీసుకున్నందుకు గర్వంగా ఫీలవుతుంటానని తెలిపింది. అయితే మరోసారి అందాల తార అందాలను చూసే అవకాశం ఉంటుందేమోనని అభిమానులు కూడా రీటా ప్రకటనపై లోలోపల సంతోషంగానే ఉన్నారు.