heart break
-
హీరోయిన్ 'విమి' విషాద గాథ.. భర్తను కాదని ఆపై ప్రేమికుడి వల్ల వ్యభిచారం
సినిమా ఒక మాయ ప్రపంచం... తెరపై మెరిసే నటుల జీవితాలు కూడా కనిపించినంత అందంగా ఏమీ ఉండవు. కెరీర్ సాగినంత కాలం ఫేమ్, స్టేటస్, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఒక్కసారి ఫేడవుట్ అయితే పట్టించుకొనే నాధుడే ఉండడు. వెండితెరపై తిరుగులేని స్టార్డమ్ అనుభవించి జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితుల మధ్య ప్రాణాలు విడిచిన నటులు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి జాబితాలో జాతీయ అవార్డు గెలుచుకున్న హీరోయిన్ విమీ ఒకరు. కానీ ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది. సినీ ప్రపంచంలో తనకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. కానీ ఆమె విజయం స్వల్పకాలికం అయింది. ఈ రోజు, ఆమె పేరు ఎవరికీ గుర్తుండదు కూడా.. కానీ ఇండియన్ సినీ ప్రపంచంలో బాగా బతికి ఆపై అత్యంత దుర్భర స్థితిలో మరిణించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో నటి విమి జీవితం విభిన్నం. పంజాబ్ రాష్ట్రానికి చెందిన విమి. ముంబైలోని సోఫియా కాలేజీ నుంచి సైకాలజీలో పట్టభద్రురాలు. ఆమె చదువు తర్వాత మల్టీ మిలియనీర్ అమీర్‌చంద్ ప్యారేలాల్ కుటుంబానికి చెందిన వ్యాపారవేత్త శివ్ అగర్వాల్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రమేయంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన నటన,అందానికి ఫిదా అయిన బాలీవుడ్ అవకాశం ఇచ్చింది. అబ్రూ, హమ్రాజ్, పతంగా వంటి హిందీ సినిమాలలో నటించింది. వీటితో మంచి గుర్తింపు దక్కింది. తర్వాత సునీల్ దత్ నటించిన హమ్రాజ్ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకుంది. తన కెరీర్లో సునీల్ దత్, శశికపూర్, రాజ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పనిచేసిన అతికొద్ది మంది నటీమణులలో విమీ కూడా ఒకరు. 60వ దశకంలోనే విమీ ఒక్క సినిమాకు రూ.3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేది. భారీ సినిమా అవకాశాలతో పాటు డబ్బు,పేరు అన్ని విమి వద్దకు వచ్చాయి. అదె సమయంలో తను టెక్స్టైల్ వ్యాపారాన్ని కూడా స్థాపించింది. తన భర్త కూడా పారిశ్రామికవేత్త కావడంతో వ్యాపార సామ్రాజ్యాన్ని సులువుగా స్థాపించింది. కొద్దిరోజుల తర్వాత తన భర్త శివ్ అగర్వాల్‌తో గొడవలు రావడం మొదలయ్యాయి. తన పట్ల అనుమానం పెరగడంతో విపరీతంగా కొట్టేవాడని విమి ఒంటరి జీవితాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. భర్త శివ నుంచి విడిపోయిన కొద్దిరోజులకు నిర్మాత,నటుడు జాలీతో విమి ప్రేమలో పడింది. అతనితో సహజీవనం చేసింది. కానీ వివాహబంధాన్ని, పిల్లల్ని పదేపదే గుర్తుచేసుకుంటూ మద్యానికి బానిసైంది. విమి కెరీర్ పతనం హుమ్రాజ్ సినిమా తర్వాత, విమి యొక్క తదుపరి చిత్రం అబ్రూ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అదేవిధంగా, శశి కపూర్‌తో ఆమె నటించిన 'పతంగ' కూడా జనాలను ఆకట్టుకోలేకపోయింది. విమి పంజాబీ హిట్ చిత్రం, నానక్ నామ్ జహాజ్ హైలో కనిపించింది. కానీ అది ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇలా వరుస పరాజయాలు విమి కెరీర్‌పై ప్రభావం చూపాయి. తర్వాత ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయి. దీంతో ఆమెను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. భర్త, పిల్లలకు దూరం అయ్యాననే బాధ మరోవైపు. చేసేదేమి లేక తన వ్యాపార సంస్థ అయిన విమి టెక్స్‌టైల్స్‌ను అమ్మి అప్పులు తీర్చి దివాలా తీసింది. ఆమె వద్ద డబ్బు లేకపోవడంతో ప్రియుడే ఆమెను చివరకు వ్యభిచారం వైపు నెట్టేశాడు. అలా తన చివరి రోజుల్లో అదె వృత్తిలో కొనసాగింది. విమి యొక్క విషాద మరణం విచ్ఛిన్నమైన వివాహం, విఫలమైన బాలీవుడ్ సినిమా కెరీర్, లైంగిక దోపిడీ ఇవన్నీ విమి జీవితాన్ని ఎంతగానో మార్చేశాయి. ఒకప్పుడు మహిళా సూపర్‌స్టార్‌గా వెలిగిన ఈ నటి అత్యంత పేదరికంలో 30 ఏళ్ల వయసులోనే మరణించింది. విమి కాలేయ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక సంక్షోభం మధ్య ముంబయి నానావతి హాస్పిటల్‌లోని జనరల్ వార్డులో చేరింది. చికిత్స పొందుతూ అక్కడ విమి మరణించింది. ఆమె బతికున్నప్పుడు ఆమె చుట్టూ ఎంతోమంది అభిమానులు, కార్లు,డబ్బు,పని మనుషులు ఉండేవారు. కానీ ఆమె మరణం తర్వాత కనీసం ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు కూడా ఒక్కరు లేరు. స్టార్డమ్ ఉన్నప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన ఆమె.. మరణం తర్వాత మృతదేహాన్ని ఒక తోపుడు బండిపై ఆస్పత్రి సిబ్బందిలో ఒకరు శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అలా ఆమె జీవితం ముగిసిపోయింది. తన చివరిరోజుల్లో కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాలేదు. ఒక అనాథగా తన జీవితాన్ని విమి ముగించింది. ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత తన చివరి చిత్రం క్రోధి విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) -
హృదయం ముక్కలైపోయింది: షణ్నూ ఇన్‌స్టా పోస్ట్..
Shanmukh Posts Heart Broken Emoji After Deepthi Sunaina Live Chat: దీప్తి సునయన- షణ్ముఖ్ బ్రేకప్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 5ఏళ్లు రిలేషన్ షిప్లో ఉన్న ఈ జంట బిగ్‌బాస్ ఎఫెక్ట్‌తో విడిపోతారని ఎవరూ ఊహించలేదు. కానీ తమ దారులు వేరంటూ షణ్ముఖ్‌తో దీప్తి సునయన తెగదెంపులు చేసుకుంది. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా బ్రేకప్ అనంతరం తొలిసారి అభిమానులతో ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి సునయన ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇన్నేళ్లలో తన లైఫ్ గురించి, కెరీర్ గురించి ఏనాడూ ఆలోచించలేదని, ఇకపై వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను అంటూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం అకస్మాత్తుగా లైవ్ నుంచి వెళ్లిపోయింది. అయితే దీప్తి లైవ్ చాట్ తర్వాత కాసేపటికే షణ్ముఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. హృదయం ముక్కలైపోయిన ఎమోజీలను జత చేశాడు. ప్రస్తుతం షణ్నూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మరోవైపు ఇలాంటి కష్ట సమయంలో మేం అండగా ఉంటాం అంటూ షణ్ముఖ్ ఫ్యాన్స్ అతనికి సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. చదవండి: Shrihan: బిగ్‌బాస్ రేపిన చిచ్చు.. సిరి-శ్రీహాన్ కూడా విడిపోతారా? రౌడీ హీరో విజయ్‌తో రష్మిక డేటింగ్? లీకైన ఫోటోలు View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
నేనే ఉంటే.. ఎవరో ఎందుకు?
జీవితంలో మనం ఎన్నింటినో ప్రేమిస్తాం. ఆ ప్రేమలు బ్రేక్ అయినప్పుడు మనసును ముక్కలు చేసుకుంటాం. మరి మనల్ని ప్రేమిస్తున్న మన జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించలేం. మనల్ని మనం ప్రేమించుకోవాలన్న స్పృహ లేకపోతే జీవితం మనల్ని ప్రేమిస్తోందన్న విషయాన్ని గ్రహించలేం. ఈ వాస్తవాన్ని ప్రశస్తి అనే యువతి గ్రహించింది. గ్రహించి ఏం చేసింది?! అవతలి వాళ్ల బలహీనతల మీద కాదు.. మన ఇబ్బందుల మీద చలోక్తులు విసురుకుని నవ్వించేవాళ్లే హీరోలు! అవే హెల్తీ జోక్స్! ఆ పనే చేస్తోంది ప్రశస్తీ సింగ్. ఆమె సొంతూరు లక్నో. కాలేజ్ చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. ఆ టైమ్‌లోనే ఐఐటీ చదివే అబ్బాయితో ప్రేమలో పడింది. ఉద్యోగరీత్యా అతను లండన్ వెళ్లాక కూడా ఆ రిలేషన్షిప్ కొనసాగింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లయ్యాక అతనితో లండన్ వెళ్లిపోయి.. అక్కడ తనకు ఇష్టమైన కప్ కేక్ షాప్ తెరవాలనుకుంది. దాని గురించి కలలే కాదు.. ప్రయత్నాలూ మొదలుపెట్టింది. ‘‘ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ లవ్ ఈజ్ ద బెస్ట్ లవ్ కదా ’’ అని మురిసిపోయింది. హార్ట్ ఎటాక్.. హార్ట్ బ్రేక్ జీవితాన్ని మించిన పజిల్ ఉంటుందా? ఏ క్షణం ఏ మలుపులో నిలబెడుతుందో తెలీదు. ప్రశస్తి విషయంలోనూ అదే జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్ లండన్ వెళ్లిపోయాక తనూ జాబ్ కోసం బెంగళూరు వెళ్లింది. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఐఐఎమ్ కోసం ప్రిపేర్ అవుతోంది. అంతలోనే ఒక రాత్రి లక్నో నుంచి ఫోన్ కాల్.. హార్ట్ఎటాక్తో తండ్రి చనిపోయాడని. పరిగెత్తింది. కుప్పకూలిన తల్లిని సంభాళించింది. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం నుంచి బయటపడ్డానికి తనకూ టైమ్ పట్టేలా ఉంది. ఒక్క రాత్రిలోనే ఎంతగానో ఎదిగిపోయిన భావన ప్రశస్తిలో. ఈ విషాదాన్ని ఎలా అధిగమించాలో తెలియడం లేదు. అసలు తన కుటుంబం ఆస్తిపాస్తుల మీదా అవగాహన లేదు తనకు. ఆ యేడాదే లక్నో ఐఐఎమ్‌లో సీట్ వచ్చింది. కాస్త ఊరట దొరికినట్టయింది ప్రశస్తికి. కుటుంబంతో కలిసి లక్నోలో ఉండే వెసులుబాటు. కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆమె బాధలో భాగం పంచుకోలేదు. స్వార్థంగా ఆలోచించాడు. ఆమెతో రిలేషన్‌ను బ్రేక్ చేసుకున్నాడు. మూడునెలలు కుమిలి కుమిలి ఏడ్చింది. అప్పుడు అర్థమైంది ఆమెకు.. అప్పటిదాకా ఎవరో ఒకరి మీద ఆధారపడే ఉంది తను. తండ్రి లేదంటే.. బాయ్‌ఫ్రెండ్. తన శక్తేంటో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు! సింగిల్@ 26 ఐఐఎమ్ చదువు.. ఆమె దిగులును ఎన్నో రోజులు కంటిన్యూ చేయలేదు. మేనేజ్మెంట్ డిగ్రీని సీరియస్‌గా తీసుకుంది. పూర్తయ్యాక ముంబై వెళ్లింది. ఓ ప్రైవేట్ టీవీ చానల్లో చేరింది. క్రియేటివ్ రైటర్‌గా ఆ జాబ్ బాగానే ఉంది. ఇంటి నుంచీ ఇంకో పోరు మొదలైంది. 26 ఏళ్లొచ్చాయి.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్? అంటూ. అప్పటికి తన ఫ్రెండ్స్ అంతా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. తనే ఒంటరిగా ఉంది. అవును.. నిజమే వయసు మీద పడుతోంది పెళ్లి కావాలి అని ఆన్లైన్లో అబ్బాయిని వెదుక్కోవడం మొదలుపెట్టింది. వావ్.. ప్రశస్తి! ఆన్లైన్ డేటింగ్‌తో అబ్బాయిల వికారాలన్నీ తెలుస్తున్నాయి ప్రశస్తికి. ఒక్కొక్క మానవుడి ఆలోచన ఒక్కో రీతి. ఒకరికి కులం కావాలి.. ఇంకొకరికి గోత్రం పట్టింపు. మరొకరికి కట్నం. వేరొకరికి సంప్రదాయం.. అయిదో వ్యక్తి ఇటు ఏడు తరాలు.. అటు ఏడు తరాల చరిత్ర ఇంపార్టెంట్.. అన్నిరకాలుగా ఓకే అనుకున్న ఆఖరి వ్యక్తి అయిన, పెళ్లి కాకుండా మిగతా వాటన్నిటికీ సిద్ధమని చెప్పాడు. చిరాకేసింది ప్రశస్తికి. తనకు నచ్చేవాడు దొరకలేదు కానీ.. ఆ ప్రాసెస్‌లో బోలెడంత కామెడీ కనిపించింది ఆమెకు. వాటినే చిన్న చిన్న సంఘటనలుగా మలిచి కొలీగ్స్ బర్త్‌డేస్, మ్యారేజ్ డేస్ పార్టీలు, ఫ్రెండ్స్‌తో గెట్ టు గెదర్స్ అప్పుడు కామెడీ షోస్ చేయడం మొదలు పెట్టింది. వాళ్లంతా ఆ కామెడీని బాగా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయం ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్‌కీ తెలిసి.. స్టాండప్ కామెడీ కోసం ఆఫర్స్ పంపారు. అప్పటికప్పుడు రాసుకునే తన స్క్రిప్ట్.. కామెడీకి ఉన్న, వస్తున్న క్రేజ్ చూసుకొని తనకు తనే ‘‘వావ్ ప్రశస్తి!’’ అనుకుంది ఆమె. దాన్ని పార్ట్‌టైమ్ జాబ్‌గా చేసుకుంది. నైట్ టు ఫైవ్ తన ఉద్యోగాన్ని నైట్ టు ఫైవ్ షిఫ్ట్‌కి మార్చుకుని వారం రోజులు ప్రతి సాయంకాలాలు స్టాండప్ కామెడీని పండిస్తూ దాన్ని పార్ట్‌టైమ్ కెరీర్‌గా మలచుకుంది ప్రశస్తి. ‘‘ఇప్పుడు నాకు 30 ఏళ్లు. స్టిల్ సింగిల్. సో వాట్? ఐ యామ్ హ్యాపీ. నాకు కావల్సిన లక్షణాలను పార్ట్నర్లో వెతుక్కోవాలని పిచ్చి ప్రయత్నాలు చేశా. ఆ ప్రాసెస్‌లో పడి నన్ను నేను ప్రేమించుకోవడం మర్చిపోయా. థ్యాంక్ గాడ్.. ఆ పిచ్చి ప్రయత్నాలే నేను మేల్కొనేలా చేశాయి. నేను వెతుక్కున్న ఆ లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయని గ్రహించేలా చేశాయి. నన్నే నేను ప్రేమించుకునేలా చేశాయి. ఫస్ట్ లవ్ ఈజింట్ బెస్ట్ లవ్.. సెల్ఫ్ లవ్ ఈజ్’’ అంటుంది ప్రశస్తీ సింగ్. – శరాది -
'ఆ ఆల్బమ్‌కు ప్రేరణ నా లవ్ ఫెయిల్యూరే'
లాస్ఏంజిల్స్: బ్రిటన్ పాప్ సింగర్ రీటా ఓరా తన రాబోయే ఆల్బమ్‌కు ప్రేరణ తన లవ్ ఫెయిల్యూరే అని చెబుతోంది. ఒకప్పుడు స్కాంట్లాండ్ డీజే కాల్విన్ హారిస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు అతనికి బైబై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే హారిస్‌తో బ్రేకప్.. తన రాబోయే ఆల్బమ్‌లో రెండు పాటలకు ప్రేరణనిచ్చిందని ఓరా వెల్లడించింది. హ్యారిస్‌తో బ్రేకప్ అనంతరం ప్రముఖ డిజైనర్ టామి హిల్ఫింగర్ కుమారుడు రిక్కితో డేటింగ్ చేసిన ఓరాకు ఆ రిలేషన్ కూడా కలిసిరాకపోవడంతో 2015 చివర్లో అతనితోనూ విడిపోయింది. 'హ్యారిస్‌తో బ్రేకప్ తరువాత చాలా కోపానికి, ఉద్వేగానికి గురయ్యాను. అతనంటే అసహ్యం కలిగింది. ఆ తరువాత మాత్రం నన్ను నీను నియంత్రించుకున్నాను. రాబోయే ఆల్బమ్‌లో ఈ హార్ట్ బ్రేకప్ గురించి రెండు పాటలుంటాయి' అని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ రీటా ఓరా తెలిపింది.