హీరోయిన్ శ్రుతిహాసన్ కొత్త అవసరం ఎత్తనుందా ? ఈ ప్రశ్నకు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. అపజయాలతో నట జీవితాన్ని ప్రారంభించిన ఈ నటి ఆ తరువాత తన కెరీర్ను సక్సెస్ఫుల్గా మలుచుకుంది. టాలీవుడ్ చిత్రం గబ్బర్సింగ్తో బంపర్ హిట్నుతన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత శ్రీమంతుడు సినిమాతోపాటు తమిళంలో పూజై, సింగం-3 వంటి చిత్రాలతో హిట్ చిత్రాల నాయకి లిస్టులో చేరింది. అలా సంఘమిత్ర వంటి చారిత్రత్మాక చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకున్న శుత్రిహాసన్ లక్కీ హీరోయిన్ అనిపించుకుంది.
అయితే అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగి వివాదాల్లో ఇరుక్కుంది. అదే సమయంలో తన తండ్రితో కలిసి నటిస్తున్న శభాష్నాయుడు చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. కారణాలేమైనా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన శ్రుతకి ప్రస్తుతం ఏ ఒక్క భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. ఆమెలో నటన అనే కోణం కాకుండా సంగీతం, గాయని అనే మరో రెండు కోణాలున్న విషయం తెలిసిందే.
ఈ రెండు రంగాల్లో మొదట్లోనే ప్రతిభను నిరూపించుకుంది. దీంతో ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు లేకపోవడంతో సంగీతం, సింగర్గా తన సత్తాను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచార. అవును శ్రుతిహాసన్ ఇప్పుడు కొత్త పోకడలకు శ్రీకారం చుట్టాలని భావిస్తోందట. ఇప్పుడు చాలామంది పాశ్చాత్య సంగీతంతో ఆల్బమ్లను రూపొందించి చేతినిండా సంపాదిస్తున్నారు. శ్రుతిహాసన్ కూడా ఈ బాటలో రాణించాలకుంటోందట.
పాశ్చాత్య సంగీతంతో పాటను రూపొందించి అందులో తానే నటించి దేశవిదేశాల వేదికలపై కార్యక్రమాలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అలా శ్రుతి పాప్ సింగర్ అవతారమెత్తబోతోందట.
Comments
Please login to add a commentAdd a comment