కొడైకెనాల్‌కు చెందిన ఇర్ఫానా హమీద్ హిప్ హాప్ సింగర్, ట్రంపెట్ ప్లేయర్. కర్నాటక సంగీతంతో సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. వీణ నేర్చుకుంది. కాలేజి రోజుల్లో పోయెట్రీ రాసేది. ఇండియన్ హిప్ హాప్‌లో కొత్త గొంతుగా మంచి పేరు తెచ్చుకుంది. యాంటి–ఫాసిజం నుంచి, తమిళ్–ముస్లిం సంస్కృతి వరకు ఇర్ఫానా సంగీతంలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్ వెబ్–సిరీస్ ‘మసాబా మసాబా’ టైటిల్ ట్రాక్ ‘ఐయామ్ యువర్ కింగ్’ పాడింది. ‘కన్నిల్ పెట్టోల్’ ట్రాక్‌తో హిప్ హాప్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది.
మన సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కల్చర్‌పై ‘షీలా సిల్క్’ చేసింది. బాలీవుడ్ పాపులర్ సాంగ్ షీలాకీ జవానీ, ఐటమ్ సాంగ్స్‌కు పేరుగాంచిన సిల్క్ స్మీత పేరులో నుంచి ‘షీలా సిల్క్’ను సృష్టించింది. యూనివర్శల్ మ్యూజిక్ గ్రూప్(యుఎంజీ) గత సంవత్సరం ‘డెఫ్ జామ్ రికార్డింగ్స్’ను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థతో కలిసి పనిచేస్తుంది ఇర్ఫానా హమీద్.
అర్బన్ కల్చర్‌కు సంబంధించిన అంశాల ఆధారంగా సృష్టించే ‘డెఫ్ పోయెట్రీ’ వింటూ పెరిగింది ఇర్ఫానా. ‘హిప్–హాప్ కల్చర్‌పై మన దేశంలోని యువతరానికి ఆసక్తి కలిగించడానికి, వారి ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అంటుంది. ప్రతి సింగర్‌కు సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది. మరి ఇర్ఫానా హమీద్‌కు ఇష్టమైనది?రకరకాల శబ్దాలు, శైలులను ఎక్స్‌ప్లోర్ చేయడం.
Comments
Please login to add a commentAdd a comment