ఛండీగడ్ : హింసను ప్రోత్సహించేలా పాటలు పాడుతూ గాల్లో ఫైరింగ్ జరిపిన పంజాబీ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా దీనికి సహకరించిన సంబంధిత పోలీసులపై కూడా కేసు నమోదైంది. వివరాల ప్రకారం సంగ్రూర్ బదబార్ గ్రామంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి సంగీత కచేరి ఏర్పాటు చేయడమే కాకుండా హింసను ప్రోత్సహించేలా పాటలు పాడుతూ గాల్లో ఫైరింగ్ జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదస్పదం అయ్యింది.
దీంతో విచారణకు ఆదేశించిన డీజీపీ దినకర్ గుప్తా..మూసేవాలకు సహకరించిన డీఎస్పీ సహా ఐదుగురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగర్ మూసేవాలపై సెక్షన్ 188 కింద కేసు పోలీసులు నమోదుచేశారు. గాయకుడు మంక్రీత్ అలాఖ్‌తో కలిసి హింసను ప్రోత్సహించేలా పాటలు పాడిన కారణంగా సిద్ధూ మూసేవాలపై గతంలోనే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
(డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్ )
Comments
Please login to add a commentAdd a comment