ప్రముఖ అమెరికన్ సింగర్ కేకే వ్యాట్ మరోసారి తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పిల్లలు, భర్తతో కలిసి బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వ్యాట్ తను 11వ సారి గర్భం దాల్చినట్లు పేర్కొంది. ఈ ఫొటోలో ఉన్న తన పిల్లలంతా బిగ్ బ్రదర్, బిగ్ సిస్టర్ అనే టీ-షర్ట్‌ను ధరించగా ఆమె భర్త జకారియా డేవిడ్ డారింగ్ ‘హియర్ వీ గో’ అనే టీ-షర్ట్‌ను ధరించాడు.
ఇక ఈ పోస్ట్‌కు కేకే వ్యాట్.. ‘నేను నా భర్త జకారియా, మా కుటుంబం మరో వ్యక్తిని వ్యాట్ బంచ్‌కి ఆహ్వానించబోతున్నామనే విషయం మీతో పంచుకోవడానికి గర్వపడుతున్నాను’ అంటూ #11 అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేసింది. అంతేగాక తమ మరో కుమార్తె కాయ్‌లాను మిస్ అవుతున్నానని, తను భౌతికంగా తమ మధ్య లేకపోయిన తన ఆలోచనలు, ఆత్మ మాతోనే ఉంటాయని పేర్కొంది. కాగా జాకకారియా డేవిడ్ ఆమె మూడవ భర్త. ఆమె మొదటి భర్త రహ్మత్ మోర్టన్‌ను 1999లో వివాహం చేసుకోగా వీరికి నలుగురు పిల్లలు సంతానం.
వారిలో ఓ కుమార్తె మరణించగా.. కీవర్ వ్యాట్ మోర్టన్(21); రహ్జా కే మోర్టన్(20), కే తార్హ్ విక్టోరియా మోర్టన్(13)లు ఉన్నారు. ఇక రెండో భర్త మైఖేల్ ఫోర్ట్‌తో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది వ్యాట్. అతడితో విడాకుల అనంతరం జకారియా డేవిడ్ డారింగ్‌ను 2018లో మూడో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం కాగా ప్రస్తుతం ఆమె మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది తెలిసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతమంది పిల్లలతో మీరెలా ఆడుకుంటారు’, 'మీరింక ఫుల్‌స్టాప్ పెట్టరా?' అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment