100 కోట్ల మంది చూశారట | The song and the video that changed my life says shakira | Sakshi
Sakshi News home page

100 కోట్ల మంది చూశారట

Published Wed, Jan 27 2016 5:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

100 కోట్ల మంది చూశారట

100 కోట్ల మంది చూశారట

'వాకా వాకా..' అంటూ ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ స్టార్ షకీరా ఇపుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. 2010 ప్రపంచ కప్‌ ఫుట్‌ బాల్‌ పోటీల కోసం రూపొందించిన ఈ గీతాన్ని ఇప్పటివరకు 100 కోట్ల మందికి పైగా వీక్షించారట. ఈ విషయాన్ని  కొలంబియన్‌ సూపర్‌స్టార్‌ ట్విట్టర్లో షేర్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అభిమానులకు ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు చెప్తూ షకీరా వీడియో పోస్ట్‌ చేసింది. ఇంతటి ఆదరణ అందించిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్ చేసింది. ఈ పాటతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. పాప్ క్వీన్ గా అంతకుముందే స్టార్డమ్ ను సొంతం చేసుకున్నప్పటికీ  'వాకా వాకా' పాటతో షకీరా మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ ప్రత్యేక గీతాన్ని ఆలపిస్తూ చేసిన డాన్స్‌ తో ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అప్పట్లో ఈ వాకా వాకా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  ఈ పాట విడుదలై ఇన్నేళ్లయినా దీని క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement